Kollapur: పేద విద్యార్థిని స్నేహ ఉన్నత చదువులకు రత్నగిరి ఫౌండేషన్ అండ
Kollapur: కొల్లాపూర్ నిరుపేద విద్యార్థిని రంగినేని స్నేహ ఉన్నత చదువులకు రత్నగిరి ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ జూపల్లి అరుణ్ ఉచిత ల్యాప్‌టాప్ అందజేసి అండగా నిలిచారు.
Kollapur: పేద విద్యార్థిని స్నేహ ఉన్నత చదువులకు రత్నగిరి ఫౌండేషన్ అండ
కొల్లాపూర్: పట్టణానికి చెందిన నిరుపేద విద్యార్థిని రంగినేని స్నేహ ఉన్నత చదువులకు రత్నగిరి ఫౌండేషన్ అండ... ప్రస్తుత సాంకేతిక యుగంలో ఉన్నత చదువులు కొనసాగించేందుకు ల్యాప్‌టాప్ అవసరమున్న కొనలేని పరిస్థితిలో ఉన్న నిరుపేద విద్యార్థిని రంగినేని స్నేహ పరిస్థితిని కొల్లాపూర్ 19వ వార్డు కౌన్సిలర్ లహరి వేణుగోపాల్ గౌడ్ గుర్తించి రత్నగిరి ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ జూపల్లి అరుణ్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి విద్యార్థినికి అవసరమైన ల్యాప్‌టాప్‌ను రత్నగిరి ఫౌండేషన్ కార్యాలయంలో కన్వీనర్ కేతూరి ధర్మ తేజ, కౌన్సిలర్ లహరి వేణుగోపాల్ గౌడ్ సమక్షంలో విద్యార్థినికి ఉచితంగా అందజేశారు.
ఆర్థిక ఇబ్బందులు విద్యకు అడ్డంకి కాకూడదనే సంకల్పంతో విద్యార్థుల భవిష్యత్తుకు అండగా నిలుస్తున్న రత్నగిరి ఫౌండేషన్ సేవలను పలువురు కొనియాడారు.
ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు, సీఆర్పీఎఫ్ రమేష్, రామ్మోహన్, వెంకటేష్ యాదవ్, నరేష్, నాగరాజు, తులసి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.




