Kadthal: కడ్తాల్‌లో నిత్య అన్నదానంలో పాల్గొన్న దశరథ్ నాయక్!

Kadthal: రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌లో జర్పుల రాధాకృష్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్య అన్నదానం; స్వయంగా భోజనం వడ్డించిన మాజీ జెడ్పీటీసీ జర్పుల దశరథ్ నాయక్.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 9 Oct 2026 7:23 PM IST
Kadthal
X

Kadthal: కడ్తాల్‌లో నిత్య అన్నదానంలో పాల్గొన్న దశరథ్ నాయక్!

Kadthal: కడ్తాల్ మండల కేంద్రంలో కడ్తాల్ మాజీ జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఈరోజు అన్నదాన కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్న కడ్తాల్ మాజీ జెడ్పిటిసి రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు జర్పుల దశరథ్ నాయక్ ఈ సందర్భంగా మాట్లాడుతూసమాజ సేవలోనే పరమార్థం ఉందని, ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడమే నిజమైన మానవ సేవ అని కడ్తాల్‌ మాజీ జెడ్పీటీసీ, లంబాడి హక్కుల పోరాట సమితి (LHPS) రాష్ట్ర ఉపాధ్యక్షుడు జర్పుల దశరథ్ నాయక్ అన్నారు.

దశరథ్‌ నాయక్‌ స్వయంగా అన్నదాన కౌంటర్ వద్ద నిలబడి,నిరుపేదలకు,బాటసారులకు,కూలీలకు ఆప్యాయంగా భోజనాన్ని వడ్డించారు.ఆయన దివంగత కుమారుడు జర్పుల రాధాకృష్ణ స్మారకార్థం ఏర్పాటు చేసిన 'జర్పుల రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్' ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలు గా ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా కొనసాగిస్తున్నారు. నిత్యం వందలాది మంది ఆకలి తీరుస్తున్న ఈ అన్నదాన కార్యక్రమం ఎండ, వాన అనే తేడా లేకుండా నిరంతరాయంగా సాగుతుండటం విశేషం.

ఈ సందర్భంగా కడ్తాల్ స్థానికులు మాట్లాడుతూపదవుల్లో ఉన్నా లేకపోయినా నిరంతరం ప్రజాసేవలోనే గడుపుతూ,తన కుమారుడి జ్ఞాపకార్థం మండలంలో ఎవరూ ఆకలితో అలమటించకూడదనే మహోన్నత ఆశయంతో దశరథ్‌ నాయక్‌ చేస్తున్న సేవలు ఎందరికో ఆదర్శనీయమని కొనియాడారు. అన్నదానంతో పాటు నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సాయం, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ నిరంతరం ప్రజలకు అండగా నిలుస్తుందని అభినందించారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY