Talakondapally: రాంపూర్ గ్రామంలో ఘనంగా దుర్గాదేవికి తొలిపూజ!
Talakondapally: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం రాంపూర్‌లో దేవీ నవరాత్రుల సందర్భంగా దుర్గాదేవికి తొలిపూజ ఘనంగా నిర్వహించారు.
Talakondapally: రాంపూర్ గ్రామంలో ఘనంగా దుర్గాదేవికి తొలిపూజ!
తలకొండపల్లి: తలకొండపల్లి మండలం రాంపూర్ గ్రామంలో దేవీ నవరాత్రులను పురస్కరించుకుని శ్రీ దుర్గాదేవికి తొలిపూజ కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ వట్టెల నిర్మల శ్రీశైలం యాదవ్ తన సతీమణితో కలిసి హాజరై, *అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, పట్టు వస్త్రాలు సమర్పించారు. గ్రామం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని, పంటలు బాగా పండాలని అమ్మవారిని వేడుకున్నారు.
అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ.. దుర్గామాత ఆశీస్సులతో రాంపూర్ గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని, గ్రామ ప్రజల అభివృద్ధి కోసం అన్ని రంగాలలో ముందు ఉంటామని తెలియజేశారు. నవరాత్రుల తొమ్మిది రోజులు గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తులకు అన్ని వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సప్పిడి ఆంజనేయులు, గ్రామపంచాయతీ పాలకవర్గం,కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళా భక్తులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.




