Makthal: విదేశాల్లో భారతదేశ పరువు తీస్తున్న రాహుల్ గాంధీ: బీజేపీ!

Makthal: మక్తల్ బీజేపీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి దేశ పరువు తీస్తున్నారని బీజేపీ నేతలు విమర్శించారు.

B. NARENDER, MAKTHAL
Published on: 19 Nov 2026 6:07 PM IST
Makthal
X

Makthal: విదేశాల్లో భారతదేశ పరువు తీస్తున్న రాహుల్ గాంధీ: బీజేపీ!

Makthal: ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ భారతదేశ పరువు తీస్తున్నాడని బిజెపి నారాయణపేట జిల్లా ప్రధాన కార్యదర్శి జి బలరాం రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు వెంకట రాములు ముదిరాజ్ పేర్కొన్నారు. మక్తల్ : గురువారం మక్తల్ పట్టణంలోని బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. భారత ప్రజలు చెల్లించిన పన్నులతో ప్రతిపక్ష హోదాలో రాజభోగాలు అనుభవిస్తూ తమ ఇష్టం వచ్చినప్పుడు విదేశాలకు వెళ్లి విదేశాలలో భారతదేశ పరువు తీయడమే కాకుండా ఇటీవల భారత్ సమ్మిట్ పేరిట విదేశస్తులను పిలిచి వారి ముందు భారత దేశ పరువు తీశారని విమర్శించారు.

మీరు మాట్లాడడమే కాకుండా విదేశాస్థులు భారతదేశాన్ని, ప్రధాని మోదీని విమర్శించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలలో పోటీ చేసి గెలవడం చేతగాక ఇలాంటి చౌక బారు పనులకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. చేతనైతే ఎన్నికలలో పోటీ చేసి బిజెపిని ఓడించాలని హితువు పలికారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదని, ప్రజలు ఎవరికి మద్దతు తెలిపితే వారు అధికార పీఠాన్ని అలంకరిస్తారని ఇది ముమ్మాటికీ నిజమని వారు అన్నారు.

ఒకవైపు ప్రపంచ దేశాలు ప్రధాని మోదీని భారత దేశ ఔన్నత్యాన్ని పొగుడుతుంటే అది చూసి ఓర్వలేని కాంగ్రెస్ నాయకులు చీటికిమాటికి ప్రధానిని విమర్శించడం మంచిది కాదన్నారు. ఎవరు ఎన్ని మాటలు అన్నా ప్రధాని మోదీ పల్లెత్తు మాట అనకుండా తమ పని చేసుకుని పోతున్న గొప్ప వ్యక్తి అని అన్నారు. చీటికిమాటికి విదేశాలకు వెళ్లి అక్కడ భారతదేశాన్ని ప్రధాని మోడీని విమర్శించినంతమాత్రాన రాహుల్ గాంధీ ప్రధాని కాలేడని, ప్రజాక్షేత్రంలోనికి వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేసిన వాడే నిజమైన రాజకీయ నాయకుడని అన్నారు.

ఆ లక్షణాలు ప్రధాని మోదీ వద్ద బిజెపి నాయకుల వద్ద ఉన్నందుకే ఆయన మూడోసారి ప్రధాని కాకలిగారని తెలిపారు. గత 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దేశం రకరకాల కుంభకోణాలలో కూరుకుపోయి అభివృద్ధి కొంటూ పడిందని తెలిపారు. 2014లో ప్రధాని మోదీ అధికారం చేపట్టాక దేశం సర్వతోముఖాభివృద్ధి చెందుతోందని తెలిపారు. 2014 వరకు దేశం ఏ చిన్న వస్తువైనా విదేశాలలో కొనే పరిస్థితి ఉండేదని ప్రస్తుతం మేక్ ఇన్ ఇండియా నినాదంతో రైలు ఇంజన్లు మొదలుకొని రక్షణ రంగానికి ఉపయోగపడే మీసైళ్ల దాకా మన దేశం ఉత్పత్తి చేసి ఇతర దేశాలకు విక్రయించడం జరుగుతుందన్నారు.

ప్రధాని పదవి తమకు వంశపారంపర్యంగా వచ్చిందని రాహుల్ గాంధీ భావిస్తున్నారని అది ఎంత మాత్రం నిజం కాదన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఓట్ చోరికి పాల్పడిందని చీటికిమాటికి రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారని అసలు ఆయన తాతగారే ఓటు చోరీకి పాల్పడి ప్రథమ ప్రధానిగా ఎన్నికయ్యారని ఈ విషయం

రాహుల్ గాంధీ తెలుసుకోవాలని తెలిపారు. ఎస్ ఐ ఆర్ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరుగుతోంది అన్నారు. ఇప్పటివరకు అర్హులైన ఏ ఒక్కరి ఓటు కూడా పోలేదని, ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ దాని తోక పార్టీలు గుర్తుంచుకోవాలన్నారు. రాహుల్ గాంధీ విదేశాలలో దేశ పరువును మంట కలపడం గమనిస్తున్నారని భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా లేకుండా చేస్తారని ఇది రాహుల్ గాంధీ గుర్తించుకోవాలని అన్నారు.

మీరు ఎంతగా భారతీయ జనతా పార్టీని ప్రధాని మోదీని విమర్శిస్తే అంతగా ఆ పార్టీ బలపడుతుందని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు కర్ణ స్వామి జిల్లా కార్యదర్శి కనకరాజు జిల్లా మైనార్టీ మోర్చా ప్రధాన కార్యదర్శి జావేద్ హుస్సేన్ జిల్లా ఓబీసీ నాయకులు ఆడం సత్యనారాయణ పాల్గొన్నారు.

B. NARENDER, MAKTHAL

B. NARENDER, MAKTHAL