Narayanpet: నారాయణపేటలో పేకాట స్థావరంపై దాడి: నలుగురు అరెస్ట్
Narayanpet: నారాయణపేట పట్టణంలోని పేరపల్ల రోడ్డులో పేకాట స్థావరంపై దాడి చేసి నలుగురిని అరెస్ట్ చేశామని, 6 బైకులు, నగదు స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ తెలిపారు.
Narayanpet: నారాయణపేటలో పేకాట స్థావరంపై దాడి: నలుగురు అరెస్ట్
నారాయణపేట జిల్లా: నారాయణపేట పట్టణంలోని పేరపల్ల రోడ్డులో ఉన్న నిర్మానుష్య ప్రదేశంలో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు పట్టణ ఎస్ఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు పట్టుకోగా, మరో ఐదుగురు అక్కడి నుంచి పరారయ్యారు.
పట్టుబడిన వారి వద్ద నుంచి పేకాటకు సంబంధించిన రూ.5,025 నగదు, 4 సెల్‌ఫోన్లు, 6 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనపై పట్టణ ఎస్ఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... పేకాట ఆడుతూ పట్టుబడిన నలుగురిపై గేమింగ్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పరారైన వారి వివరాలను సేకరించి తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
జిల్లాలో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని, పేకాట, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఎస్ఐ సూచించారు.




