Narayanpet: హోంగార్డ్ కుటుంబానికి పోలీస్ శాఖ అండ: ఎస్పీ డా.వినీత్

Narayanpet: గుండెపోటుతో మృతి చెందిన హోంగార్డ్ బాలకృష్ణ భార్య భవానికి నారాయణపేట జిల్లా ఎస్పీ డా.వినీత్ పోలీస్ వెల్ఫేర్ నిధి నుంచి రూ.15 వేల చెక్కును అందజేశారు.

P.HANMANTHU, NARAYANAPETA
Updated on: 2 Nov 2026 5:26 PM IST
Narayanpet
X

Narayanpet: హోంగార్డ్ కుటుంబానికి పోలీస్ శాఖ అండ: ఎస్పీ డా.వినీత్

నారాయణపేట జిల్లా: నారాయణపేట జిల్లా పోలీస్ శాఖలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తూ ఇటీవల గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందిన బాలకృష్ణ కుటుంబానికి జిల్లా పోలీస్ శాఖ అండగా నిలిచింది. పోలీస్ వెల్ఫేర్ నిధి నుంచి మంజూరైన రూ.15,000 పరిహార చెక్కును సోమవారం జిల్లా ఎస్పీ డా.వినీత్ మృతుడి భార్య భవానికి అందజేశారు.

కొత్తపల్లి మండలం గోకుల్ నగర్‌కు చెందిన బాలకృష్ణ నారాయణపేట జిల్లా పోలీస్ శాఖలో హోంగార్డుగా విధులు నిర్వహించారు. ఆయన ఆకస్మిక మరణంతో భార్య భవాని, ముగ్గురు చిన్నారులు కుటుంబ పెద్దను కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్నారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో బాలకృష్ణ అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. విధి నిర్వహణలో భాగంగా పోలీస్ శాఖకు సేవలందించిన సిబ్బంది కుటుంబాలకు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ఆపద సమయంలో వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు పోలీస్ శాఖ ముందుంటుందని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి ఎండి రియాజ్ హుల్ హక్, RSI శివ శంకర్ పాల్గొన్నారు.

P.HANMANTHU, NARAYANAPETA

P.HANMANTHU, NARAYANAPETA