Pebbair: పెబ్బేరులో మండల స్థాయి SGF క్రీడలు ప్రారంభం!

Pebbair: పెబ్బేరు జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో మండల స్థాయి SGF క్రీడలు ప్రారంభమయ్యాయి.

G. BALAVARDHAN, PEBBERU
Published on: 17 Sept 2026 10:30 AM IST
Pebbair
X

Pebbair: పెబ్బేరులో మండల స్థాయి SGF క్రీడలు ప్రారంభం!

Pebbair: వనపర్తి జిల్లా పెబ్బేరు జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాల క్రీడా మైదానంలో మండల స్థాయి SGF (School Games Federation) క్రీడలు పట్టణ ప్రముఖుల చేతుల మీదుగా ప్రారంభమయ్యాయి.

ఈ సందర్భంగా పట్టణ ప్రముఖులు మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం క్రీడలు ఆడటం వల్ల శారీరక దృఢత్వంతో పాటు ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారని తెలిపారు. క్రీడల్లో పాల్గొంటున్న విద్యార్థులందరికీ ఆల్‌ ది బెస్ట్‌ చెబుతూ బాగా ఆడాలని ప్రోత్సహించారు.

ఈ సందర్భంగా PET కురుమయ్య మాట్లాడుతూ.. మండల స్థాయి SGF క్రీడల్లో సుమారు 350 మంది విద్యార్థులు పాల్గొంటున్నారని తెలిపారు. అండర్‌-17 విభాగంలో కోకో, కబడ్డీ, వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ క్రీడలు రెండు రోజుల పాటు కొనసాగుతాయని వెల్లడించారు.

క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జిల్లా స్థాయి పోటీలకు, అక్కడి నుంచి ఉమ్మడి జిల్లా స్థాయికి, అనంతరం రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేసి తీసుకెళ్తామని PET కురుమయ్య తెలిపారు.

ఈ క్రీడా పోటీలు ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడానికి ప్రధాన కారణం జడ్పీహెచ్‌ఎస్‌ ప్రిన్సిపల్‌ నరసింహ గౌడ్ పేర్కొన్నారు.

అనంతరం ప్రిన్సిపల్‌ నరసింహ గౌడ్ మాట్లాడుతూ.. పాఠశాల అభివృద్ధికి, ముఖ్యంగా క్రీడా మైదానం గ్రౌండ్‌ క్లీనింగ్‌తో పాటు ఇతర కార్యక్రమాలకు పట్టణ ప్రముఖులు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించారని తెలిపారు. విద్యార్థుల కోసం క్రీడా సదుపాయాలను మెరుగుపరిచేందుకు సహకరిస్తున్న పట్టణ ప్రముఖులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

G. BALAVARDHAN, PEBBERU

G. BALAVARDHAN, PEBBERU