Pebbair: పెబ్బేరులో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేసిన బీజేపీ నాయకులు
Pebbair: భారత్ సమ్మిట్ పేరుతో దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారంటూ బీజేపీ ఆధ్వర్యంలో పెబ్బేరు పట్టణంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు.
Pebbair: పెబ్బేరులో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేసిన బీజేపీ నాయకులు
పెబ్బేర్: భారత్ సమ్మిట్ పేరిట రాహుల్ గాంధీ భారతదేశంపై విషప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ భారతీయ జనతా పార్టీ పెబ్బేర్ పట్టణ, మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు శనివారం పెబ్బేర్ పట్టణంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేసి తమ నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ, రాహుల్ గాంధీ విదేశీ శక్తుల ప్రోత్సాహంతో భారతదేశ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించే రాజకీయ నాయకుల వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు కావలి క్రాంతి నాయుడు, మండల అధ్యక్షులు నాగరాజ్ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు మొగిలి రాఘవేంద్ర గౌడ్, సీనియర్ నాయకులు చింతల రామకృష్ణ, కిసాన్ మోర్చా జిల్లా నాయకులు కసిరెడ్డి వెంకట్రామిరెడ్డి, బీజేవైఎం జిల్లా నాయకులు చింతకాయల శివ, ప్రధాన కార్యదర్శులు సర్వేశ్వర్ గౌడ్, దేవేందర్, జగత్కారి నర్సోజి, కార్మిక సెల్ జిల్లా కన్వీనర్ బి. సుబ్రమణ్యం, బీజేవైఎం మండల అధ్యక్షులు కళ్యాణ్ నాయుడు, కుభేరా నాయుడు తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




