Pebbair: 715 మందికి కొత్త చేయూత పెన్షన్లు అందజేత

Pebbair: పెబ్బేరులో కొత్తగా మంజూరైన 715 చేయూత పెన్షన్ల ఉత్తర్వులు, రేషన్ కార్డులు, సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

G. BALAVARDHAN, PEBBERU
Published on: 16 Nov 2026 10:23 PM IST
Pebbair
X

Pebbair: 715 మందికి కొత్త చేయూత పెన్షన్లు అందజేత

పెబ్బేరు: పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. సోమవారం పెబ్బేరులోని వల్లపు రెడ్డి అనసూయమ్మ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పెబ్బేరు మండల, మున్సిపాలిటీ పరిధిలో కొత్తగా మంజూరైన 715 చేయూత పెన్షన్ల ఉత్తర్వులను లబ్ధిదారులకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పాల్గొన్నారు. అర్హులైన వారిని గుర్తించి పారదర్శకంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వారు తెలిపారు.

అనంతరం లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు పత్రాలు, స్మార్ట్ రేషన్ కార్డులు, ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్‌పర్సన్ సుమిత్ర ఎల్లారెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

G. BALAVARDHAN, PEBBERU

G. BALAVARDHAN, PEBBERU