Kollapur: కల్వకోల్ గ్రామంలో ఈ నెల 21న పండుగ సాయన్న విగ్రహావిష్కరణ!

Kollapur: కొల్లాపూర్ మండలం కల్వకోల్ గ్రామంలో ఈ నెల 21న పండుగ సాయన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు మత్స్యకారుల సంఘం నాయకులు తెలిపారు.

VENKATESWARA CHARY, KOLLAPUR
Published on: 15 Nov 2026 9:44 AM IST
Kollapur
X

Kollapur: కల్వకోల్ గ్రామంలో ఈ నెల 21న పండుగ సాయన్న విగ్రహావిష్కరణ!

Kollapur: పెద్దకొత్తపల్లి మండలం కల్వకోల్ గ్రామంలో మత్స్యకారుల ఆత్మగౌరవానికి ప్రతీకగా... బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా నిలిచిన మహనీయుడు పండుగ సాయన్న విగ్రహావిష్కరణ ఈ నెల 21న జరగనున్నట్లు మత్స్యకారుల సంఘము నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు, మరియు మంత్రి వాకిటి శ్రీహరి లు వస్తున్నట్లు తెలిపారు. మత్స్యకారుల దినోత్సవం సందర్భంగ కల్వకోల్ గ్రామంలో తెలంగాణ తెనుగోళ్ల ముద్దుబిడ్డ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ధైర్యసాహసాలకు ప్రతీక పండుగ సాయన్న విగ్రహావిష్కరణ మహోత్సవం నిర్వహించబడుతుందన్నారు.

కులమతాలకు, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములై, మత్స్యకారుల ఐక్యతను చాటుతూ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరారు.

VENKATESWARA CHARY, KOLLAPUR

VENKATESWARA CHARY, KOLLAPUR