Devarkadra: దేవరకద్రలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మహాజనసభ నిర్వహణ!
Devarkadra: మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర PACS కార్యాలయంలో చైర్మన్ డోకూర్ నరేందర్ రెడ్డి అధ్యక్షతన మహాజనసభ. రుణాలు, ఎరువుల సరఫరాపై సమీక్ష.
Devarkadra: దేవరకద్రలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మహాజనసభ నిర్వహణ!
Devarkadra: మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో సొసైటీ కార్యాలయంలో మంగళవారం రోజు మహాజనసభ జరిగింది. ఈ సమావేశానికి సొసైటీ చైర్మన్ డోకూర్ నరేందర్ రెడ్డి అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా రైతులకు సంబంధించిన పలు అంశాలపై సమావేశంలో చర్చించారు.
ముఖ్యంగా రైతుల రుణాలు,ఎరువుల సరఫరా, సొసైటీ అభివృద్ధి తదితర అంశాలపై సమీక్షించారు.రైతులందరూ సొసైటీ ద్వారా రుణాలు తీసుకుని,వాటిని సకాలంలో తిరిగి చెల్లించాలని సూచించారు. రుణాలను సకాలంలో చెల్లించడం ద్వారా సొసైటీ కార్యకలాపాలు మరింత సమర్థవంతంగా కొనసాగించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.
అలాగే ఎరువుల సరఫరాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే సొసైటీ అధికారులు,సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తే వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
సొసైటీ అభివృద్ధితో పాటు రైతులకు మరింత మెరుగైన సేవలు అందించే అంశాలపై కూడా మహాజనసభలో చర్చించారు.ఈ కార్యక్రమంలో మానిటింగ్ ఆఫీసర్ శ్రీనివాసులు, ఆడిటర్ శ్రీనివాసులు,సీఈఓ శ్రీనివాసులు,సొసైటీ డైరెక్టర్లు మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతులు పాల్గొన్నారు.




