Achampet: ఆన్లైన్ ఇసుక బుకింగ్ విఫలం..బ్లాక్‌లో ఇసుక దందా!
Achampet: అచ్చంపేటలో ఆన్లైన్లో డబ్బులు చెల్లించి ఇసుక బుక్ చేసినా లబ్ధిదారులకు అందడం లేదు. బ్లాక్ మార్కెట్లో మాత్రం అదనపు ధరలకు రాత్రికి రాత్రే ఇసుక సరాఫరా అవుతోంది.
Achampet: అచ్చంపేటలో ఆన్లైన్ ఇసుక బుకింగ్ విఫలం..బ్లాక్‌లో ఇసుక దందా!
Achampet: ప్రభుత్వం పారదర్శకంగా ఇసుక సరఫరా చేయాలనే ఉద్దేశంతో ఆన్ లైన్ బుకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇసుక అక్రమ రవాణాను అరికట్టి ప్రభుత్వ ఆదాయాన్ని పెంపొందించేందుకు పాటు సామాన్యులకు నిర్ణీత ధరకు ఇసుక అందించాలన్నది ఈ విధానం వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం కావచ్చు, కానీ అచ్చంపేట ప్రాంతంలో మాత్రం ప్రభుత్వ లక్ష్యానికి భిన్నంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఆన్ లైన్ లో డబ్బులు చెల్లించి బుకింగ్ చేసుకున్న వారికి ఇసుక సరఫరా చేయడంలో జాప్యం జరుగుతుండగా, మరోవైపు అదనపు ధర చెల్లిస్తే రాత్రికి రాత్రే ఇసుక ఇంటి ముందు వరకు చేరుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఒక్కో ట్రాక్టర్ కు ప్రైవేటుగా రూ.500 నుంచి రూ.1000 అదనంగా చెల్లించేందుకు సిద్ధపడితే ఇసుక సులభంగా అందుతుందన్న ప్రచారం, ప్రభుత్వానికి నిజంగా డబ్బులు చెల్లించి ఆన్ లైన్ లో బుకింగ్ చేసుకున్న సామాన్యులకు ఎందుకు ఇసుక సరఫరా కావడం లేదని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఆన్ లైన్ లో బుకింగ్ చేసుకున్న వారికి ఇసుక అందించే పరిస్థితి ఉన్నప్పుడు ఈ విధానం ఎందుకు ప్రవేశపెట్టినట్లు? అక్రమంగా ఇసుక విక్రయాలు జరుగుతున్నాయనే ఆరోపణలపై సంబంధిత అధికారులు ఎందుకు స్పందించడం లేదనే ప్రశ్నలు వస్తున్నాయి.
రూ.8389 చెల్లించినా ఇసుక అందలేదు..
అచ్చంపేట పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ సర్పంచ్ గారి పాటి సుదర్శన్ కు ఎదురైన అనుభవమే అధికారుల పనితీరుకు నిదర్శనంగా నిలుస్తోంది. రెండు పర్యాయాలు ఆయన సర్పంచ్ గా, ఒక సారి ఆయన భార్య సర్పంచ్ గా పనిచేసి పట్టణ ప్రజలకు సేవలు అందించారు.
ప్రస్తుతం తాను సొంతంగా పేదలు, చదువుకునే వారికి అవసరమైన వారికి అనేక విధాలుగా ఆర్థిక సహకారాలు అందిస్తూ అండగా నిలుస్తున్నారు. ప్రస్తుతం 80 ఏళ్ల వయసులో తన సొంత ఇంటికి మరమ్మతులు చేయించాలనే ఉద్దేశంతో గత అక్టోబర్ నెల 4వ తేదీన ఆన్ లైన్ లో రెండు ట్రిప్పుల ఇసుక కోసం రూ. 8389.6 చెల్లించి బుకింగ్ చేసుకున్నారు.
బుకింగ్ ఐడి MIVB2026334157, ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ నెంబర్ MIVR 20262206098, ఇసుక రీచ్ పోతి డ్యామ్ లో, కాంట్రాక్ట్ నెంబర్ 9440841454, 9849132121 బుకింగ్ చేసుకున్నారు. గత నెల 24వ తేదీన ఇసుక సరఫరా చేస్తామని సంబంధిత వ్యక్తి నుంచి మెసేజ్ వచ్చినప్పటికీ, ఇప్పటి వరకు ఇసుక రాలేదు.
కనీసం డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదు. ఇసుక వస్తుందనే ఆశతో మేస్త్రీ రూ.5వేలు అడ్వాన్స్ గా చెల్లించగా, పనులు ప్రారంభం కాక పోవడంతో మేస్త్రీ కూడా రాజస్థాన్ కు వెళ్లిపోయాడు. రెండు పండుగలు గడిచిపోయాయి. పిల్లలు ఇంటికి వచ్చి తిరిగి వెళ్లిపోయినా ఇంటి మరమ్మతులు పని మాత్రం ప్రారంభం కాలేదు. ఇసుక రాలేదు. ఇలా ఉంది ప్రజాపాలన వ్యవస్థ పని తీరు.
అధికారులకు ఫోన్లు చేసినా స్పందన కరువు..
ఇసుక సరఫరాపై జిల్లా మైనింగ్ అధికారులకు పలుమార్లు ఫోన్ చేసినా స్పందన లేదని సుదర్శన్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలిసిన అధికారులందరినీ సంప్రదించి విసిగిపోయానని, చివరకు తనకు చెల్లించిన డబ్బులైనా తిరిగి ఇప్పించాలని జిల్లా కలెక్టర్ కు మెసేజ్ రూపంలో విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. 80 ఏళ్ల వయసులో కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి లేదని, అందుకే కలెక్టర్ కు ఫోన్ ద్వారా ఫిర్యాదు పంపినట్లు తెలిపారు.
ప్రస్తుతం నిబంధనల ప్రకారం ఆన్ లైన్ లో బుకింగ్ చేసుకున్న వారికి ఇసుక సరఫరా కావాల్సి ఉండగా అదనపు ధరకు బ్లాక్ లో ఇసుక సరఫరా జరుగుతోందనే ఆరోపణలు ఉన్నాయి. ఆన్ లైన్ బుకింగ్ సొమ్ము కట్టి ఇసుక ఎక్కడికి వెళ్లిపోయింది? అనే ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి.
ఆన్ లైన్ లో డబ్బులు చెల్లించిన లబ్ధిదారులకు ఇసుక సరఫరా చేయకపోవడం వల్ల, ఫిర్యాదు చేసిన అధికారులు స్పందించకపోవడం వల్ల ఇసుక బుకింగ్ చేసుకున్న వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కలెక్టర్ స్పందించి ఉప్పును తొలగించి నదీ ఇసుకను ఉచిత రీజన్ నుంచి ఇస్తే ఇసుక యొక్క సిల్ట్ సమస్య పరిష్కారం చేస్తే బుక్కింగ్ చేసుకున్న వారికి మాత్రమే కాకుండా కొత్తగా కూడా నదీ ఇసుకను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారని కోరుతున్నారు.
ఆన్ లైన్ లో బుకింగ్ చేసుకుని డబ్బులు చెల్లించిన లబ్ధిదారులకు వెంటనే ఇసుక అందించాలి, లేనిపక్షంలో వారి డబ్బులు తిరిగి చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఆదాయాన్ని పెంపొందించ డంతో పాటు సామాన్యులకు నిర్ణీత ధరకు ఇసుక అందించాలన్నది ఈ విధానం వెను క ఉన్న ప్రధాన లక్ష్యం కావొచ్చు.
కానీ అచ్చం పేట ప్రాంతంలో మాత్రం ప్రభుత్వ లక్ష్యానికి భిన్నంగా పరిస్థితులు కనిపిస్తు న్నాయి. ఆన్ లైన్లో డబ్బులు చెల్లించి బు కింగ్ చేసుకున్న వారికి ఇసుక సరఫరా చే యడంలో జాప్యం జరుగు తుండగా, మ రోవైపు అదనపు ధర చెల్లిస్తే రాత్రికి రాత్రే ఇసుక ఇంటిముందుకు చేరుతుందనే విమ ర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఒక్కో ట్రాక్టర్ కు ట్రిప్పుకు రూ.500 నుంచి రూ.1000 అదనంగా చెల్లించేందుకు సిద్దపడితే ఇసుక సులభంగా అందుతున్నప్పుడు, ప్రభుత్వా నికి డబ్బులు చెల్లించి ఆన్ లైన్ బుకింగ్ చేసుకున్న సామాన్యులకు ఎందుకు ఇసుక సర ఫరా కావడం లేదని ప్రశ్నలు తలెత్తుతు న్నాయి.
ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్న వా రికి ఇసుక అందించ లేని పరిస్థితి ఉన్నప్పు డు ఈ విధానం ఎందుకు ప్రవేశపెట్టినట్లు? అక్రమంగా ఇసుక విక్రయాలు జరుగుతు న్నాయనే ఆరోప ణలపై సంబంధిత అధికా రులు ఎందుకు స్పందించడం లేదనే ప్రశ్న లు వస్తున్నాయి.
రూ.8389 చెల్లించినా ఇసుక అందలేదు..
అచ్చంపేట పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ సర్పంచ్ గార్ల పాటి సుదర్శను ఎదురైన అనుభవమే అధికారుల పనితీరుకు నిదర్శనంగా నిలు స్తోంది. రెండు పర్యాయాలు ఆయన స ర్పంచ్, ఒక సారి ఆయన భార్య సర్పం చ్ గా పనిచేసి పట్టణ ప్రజలకు సేవలు అం దించారు.
ప్రస్తుతం తాను సొంతంగా పేద లు, చదువుకునే వారికి అవసరమై న వారి కి అనేక విధాలుగా ఆర్థిక సహకారాలు అం దిస్తూ అండగా నిలుస్తున్నారు. ప్రస్తుతం 80ఏళ్ల వయసులో తన సొంత ఇంటికి మ రమ్మతులు చేయిం చకోవాలనే ఉద్దేశంతో గత అక్టోబర్ నెల 4వ తేదీన ఆన్ లైన్లో రెండు ట్రిప్పుల ఇసుక కోసం రూ.8389. 6 చెల్లించి బుకింగ్ చేసుకున్నారు. బుకింగ్ ఐడీ MIVB202633415 7, ట్రాన్స్సె క్షన్ రెఫరెన్స్ నెంబర్ MIVR 202622
06098, ఇసుక రీచ్ పోతి రెడ్డిపల్లి, కాం ట్రాక్ట్ నెంబర్ 9440841454, 9849 132121 బుకింగ్ చేసుకున్నారు. గత నెల 24వ తేదీన ఇసుక సర ఫూ చేస్తామని సం బంధిత వ్యవస్థ నుంచి మెసేజ్ వ చ్చినప్ప టికీ, ఇప్పటి వరకు ఇసుక రాలేదు. కనీసం డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదు.
ఇసుక వస్తుందనే ఆశతో మేస్త్రికి రూ.5వేలు అ డ్వాన్స్‌డ్ చెల్లించగా, పనులు ప్రారంభం కాక పోవడంతో మేస్త్రి కూడా రాజస్థాన్‌కు వెళ్లిపోయాడు. రెండు పండుగలు గడిచిపో యాయి. పిల్లలు ఇంటికి వచ్చి తిరిగి వెళ్లి పోయినా ఇంటి మరమ్మతుల పనిమాత్రం ప్రారంభం కాలేదు. ఇసుక రా లేదు. ఇలా ఉంది ప్రజాపాలన వ్యవస్థ పని తీరు.
అధికారులకు ఫోన్లు చేసినా స్పందన కరువు..
ఇసుక సరఫరాపై జిల్లా మైనింగ్ అధికా రులకు పలుమార్లు ఫోన్ చేసినా స్పందన లేదని సుదర్శన్ ఆవేదన వ్యక్తం చేశారు. తె లిసిన అధికారులందరినీ సంప్రదించి విసి గిపోయానని, చివరకు తనకు చెల్లించిన డబ్బులైనా తిరిగి ఇప్పించాలని జిల్లా కలె ని క్టర్‌కు మెసేజ్ రూపంలో విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.
80 ఏళ్ల వయసులో కార్యాల యాల చుట్టూ తిరిగే పరిస్థితి లేదని, అందుకే కలెక్టర్‌కు ఫోన్ ద్వారా ఫిర్యాదు పంపినట్లు తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్న వారికి ఇసుక సరఫరా కావాల్సి ఉండగా అదనపు ధరకు బ్లాక్ లో ఇసుక సరఫరా జరుగుతోందనే ఆరోపణలు ఉన్నాయి.
ఆన్లైన్ బుకింగ్‌లకు కేటా యించిన ఇసుక ఎక్కడికి వెళ్తాంది? అనే ప్రశ్నలు వ్యక్తమ వు తున్నాయి, ఆన్ లైన్లో లో డబ్బులు చెల్లించిన లబ్దిదారులకు ఇసుక సరఫరా చేయకపోవ డంతో, ఫిర్యాదు చేసిన అధికారులు స్పం దించకపోవడం వల్ల ఇసుక బుకింగ్ చేసు కున్న వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు.
కలెక్టర్ స్పందించి ఉప్పునుం తల దుందుభి నది అనుమతి ఉన్న రీచ్‌ల నుంచి ఇన్ లైన్ ఇసుక బుకింగ్స్ పై సమగ్ర విచారణ చేప ట్టాలని స్థానికులు కోరుతు న్నారు. ఆన్లైన్లో బుకింగ్ చేసుకుని డబ్బులు చెల్లించిన లబ్ధిదారులకు వెంటనే ఇసుక అందించాలి, లేనిపక్షులో వారి డబ్బులు తిరిగి చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.




