Achampet: 22 మంది బాలకార్మికులకు విముక్తి కల్పించిన అధికారులు!

Achampet: బల్మూర్ మండలం కేంద్రంలో వ్యవసాయ పనుల నిమిత్తం వాహనాల్లో తరలిస్తున్న 22 మంది బాలకార్మికులను అధికారులు, స్వచ్ఛంద సంస్థ సభ్యులు రక్షించి బడులకు పంపించారు.

V. RAVINDR GOUD, ACCHAMPETA
Published on: 26 Oct 2026 4:59 PM IST
Achampet
X

Achampet: 22 మంది బాలకార్మికులకు విముక్తి కల్పించిన అధికారులు!

Achampet: బల్మూర్ మండల కేంద్రంలో గల అంబేద్కర్ చౌరస్తా వద్ద సోమవారం ఉదయం ఇతర ప్రాంతాల నుండి బుల్లోరా, ఆటో ,ట్రాక్టర్ , వాహనాలలో వ్యవసాయ పొలాల్లోపనిచేయుటకు 22 మంది బాల కార్మికులను తరలిస్తున్న వాహనాలను విద్యాశాఖ, పోలీస్ శాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, చైల్డ్ హెల్ప్ లైన్, స్వచ్ఛంద సంస్థ కోనేరు, ఆధ్వర్యంలో తరలిస్తున్న బాలకార్మిక పిల్లాలను విముక్తి కల్పించి వారిని వారి వారి పాఠశాలలకు తిరిగి పంపించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ మల్లేష్, పోలీస్ శాఖ పిసి ప్రసాద్, కోనేరు స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్టు కోఆర్డినేటర్ ఆంజనేయులు, ఏరియా కోఆర్డినేటర్లు జాకీర్ హుస్సేన్ శ్రీనివాసులు శివుడు, సర్పంచి భర్త మహేష్ తదితరులు పాల్గొన్నారు.

V. RAVINDR GOUD, ACCHAMPETA

V. RAVINDR GOUD, ACCHAMPETA