Makthal: మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాలతో 7వ వార్డులో ఇందిరమ్మ కుటుంబ బీమా!
Makthal: మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు మక్తల్ మున్సిపాలిటీ 7వ వార్డులో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని కౌన్సిలర్, కమిషనర్ ప్రారంభించారు.
Makthal: మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాలతో 7వ వార్డులో ఇందిరమ్మ కుటుంబ బీమా!
Makthal: మక్తల్ లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు,మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డ్ గుర్లపల్లి రోడ్డులో ప్రారంభించిన స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ .కలాల్ శ్రీ విద్యనీల గౌడ్, మక్తల్ మున్సిపల్ కమిషనర్ రాజయ్య, వార్డ్ ఇంచార్జ్ ఆనంద్,అమర్,RP భాగ్యలక్ష్మి,యూత్ కాంగ్రెస్ నాయకుడు.రవుప్ పాషా, మంజునాథ్,ఫిరోజ్, మల్లేష్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పథకం యొక్క ముఖ్య ఉద్దేశాలు, కుటుంబాలకు కలిగే ప్రయోజనాల గురించి వార్డు ప్రజలకు వివరించారు. ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడం, ఆపద సమయంలో అండగా నిలవడం ఈ పథకం ప్రధాన ఉద్దేశమని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో 7 వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.




