Mahabubnagar: జాతీయ సీనియర్ మెన్స్ ఓపెన్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్!

Mahabubnagar: మహబూబ్‌నగర్ JPNCE కాలేజీలో అక్టోబర్ 8 నుండి 11 వరకు జాతీయ స్థాయి బాక్సింగ్ ఛాంపియన్‌షిప్. దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాల నుండి తరలిరానున్న క్రీడాకారులు.

NARENDRA CHARY,  Sr. Staff Reporter -MAHABOOBNAGAR
Published on: 7 Oct 2026 5:40 PM IST
Mahabubnagar
X

Mahabubnagar: జాతీయ సీనియర్ మెన్స్ ఓపెన్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్!

Mahabubnagar: ​మహబూబ్‌నగర్ జిల్లా క్రీడారంగంలో ఒక అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. జయప్రకాష్ నారాయణ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ (JPNCE) ప్రాంగణంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 'జయప్రకాష్ నారాయణ్ నేషనల్ సీనియర్ మెన్స్ ఓపెన్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్' కు సర్వం సిద్ధమైంది!

​అక్టోబర్ 8 నుండి 11 వరకు నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ జాతీయ స్థాయి బాక్సింగ్ పోరుకు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం వేదికగా కానుంది.

జాతీయ క్రీడా ఉత్సవానికి దేశవ్యాప్తంగా ఉన్న 25 రాష్ట్రాల నుంచి దిగ్గజ బాక్సింగ్ క్రీడాకారులు తరలివస్తున్నారు. JPNCE కాలేజ్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మహబూబ్‌నగర్ జిల్లా చైర్మన్ కే. ఎస్. రవి కుమార్ గారు మాట్లాడారు.ఈ ప్రెస్ మీట్‌కు ముఖ్య అతిథిగా రాకేష్ టక్కర్ గారు హాజరయ్యారు.కేంద్ర ప్రభుత్వం విద్యార్థులలో క్రీడా స్ఫూర్తిని ప్రోత్సహించాలనే గొప్ప ఉద్దేశంతో అందులో భాగంగానే, రేపు జయప్రకాష్ నారాయణ్ గారి జయంతి సందర్భంగా ఈ జాతీయ బాక్సింగ్ పోటీలను ఘనంగా ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. క్రీడాకారుల వసతి, పోటీల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు.

NARENDRA CHARY,  Sr. Staff Reporter -MAHABOOBNAGAR

NARENDRA CHARY, Sr. Staff Reporter -MAHABOOBNAGAR

రెండున్నర దశాబ్దాలకు పైగా క్షేత్రస్థాయి అనుభవంతో, మహబూబ్‌నగర్ జిల్లా సామాజిక, రాజకీయ పరిణామాలపై నిరంతరం కథనాలు అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.