Nagarkurnool: పోతేపల్లిలో జాతీయ కుటుంబ ప్రయోజన పథకం చెక్కు అందజేత!

Nagarkurnool: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పోతేపల్లిలో నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ చెక్కు అందజేత.. సర్పంచ్ తగుళ్ల కొండలు యాదవ్.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 18 Sept 2026 12:09 PM IST
Nagarkurnool
X

Nagarkurnool: పోతేపల్లిలో జాతీయ కుటుంబ ప్రయోజన పథకం చెక్కు అందజేత!

Nagarkurnool: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి, పోతేపల్లి గ్రామ సర్పంచ్ తగుళ్ల కొండలు యాదవ్ అన్నారు.

ఇటీవల నూనె కృష్ణయ్య మృతి చెందడంతో వారి కుటుంబాలకు ప్రభుత్వం నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ (NFBS) కింద మంజూరు చేసిన రూ.20 వేల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును మంగళవారం బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ కొండలు యాదవ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అవసరమైన వారికి ప్రభుత్వ పథకాల ద్వారా ఆర్థిక భరోసా అందేలా తనవంతు సహకారం అందిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు & యువ నాయకులు శారద బాలయ్యగౌడ్, గోరటి అశోక్ కుమార్, బాలు యాదవ్,ఎగిరిశెట్టి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY