Narayanpet: విద్యుత్ ఉద్యోగుల పెండింగ్ పీఆర్సీని వెంటనే ప్రకటించాలి

Narayanpet: నారాయణపేటలో విద్యుత్ సంఘం ప్రధాన కార్యదర్శి ఇనుగుల శ్రీధర్ విలేకరుల సమావేశంలో మాట్లాడి, పెండింగ్ పీఆర్సీతో పాటు స్పాట్ బిల్డర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

P.HANMANTHU, NARAYANAPETA
Published on: 13 Nov 2026 2:45 PM IST
Narayanpet
X

Narayanpet: విద్యుత్ ఉద్యోగుల పెండింగ్ పీఆర్సీని వెంటనే ప్రకటించాలి

నారాయణపేట: నారాయణపేట జిల్లా ..రాష్ట్రంలో విద్యుత్తు ఉద్యోగులకు 2026 పెండింగ్ పీఆర్సీ కమిటీ ని త్వరగా తినవేసి ఉద్యోగులకు రావలసిన పిఆర్సి సకాలంలో అందేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందని 327 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇనుగుల శ్రీధర్ అన్నారు.

నారాయణపేట సర్కిల్ పరిధిలోని దామరగిద్ద, నారాయణపేట సెక్షన్లలో జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా నారాయణపేట శ్రీ గార్డెన్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నారాయణపేట నూతన సర్కిల్ ఏర్పడిన తర్వాత సర్కిల్ భైఫర్ కేషన్ లో వచ్చిన పోస్టులను తిరిగి మళ్లీ ఉమ్మడి మహబూ నగర్ జిల్లాలో కేటాయించినందుకు ఇక్కడ అరకురా ఉద్యోగస్తులతో సర్కిల్ నువ్వు నడిపిస్తున్నారని ఆయన దుబ్బయ్యబట్టారు.

ముఖ్యమంత్రి ప్రతినిత్యం వహిస్తున్న జిల్లాలో విద్యుత్ శాఖలో నారాయణపేట సర్కిల్లో సరియైన పోస్టుల అధికారులు లేనందున ప్రజలకు సేవలు అందించడంలో ఉద్యోగులకు పనివారం పెరుగుతుందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవేదన వెలబుచ్చారు. పనిచేస్తున్న ఉద్యోగులపై భారం పడుతుందన్నారు. కావున ఇక్కడ నుండి డిప్యూటేషన్ పై వెళ్లిన ఉద్యోగస్తులను తిరిగి ఇక్కడే విధులు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

విద్యుత్ శాఖలో స్పాట్ బిల్లర్గా విధులు నిర్వహిస్తున్న కార్మికులు విద్యుత్ శాఖలో 50 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న వారు ఉన్నారన్నారు. స్పాట్ సిల్వర్ ల విద్యార్హతను బట్టి, ఐటిఐ ఉన్న స్పాట్ బిల్లర్ లను ఆర్టిజన్ల మాదిరిగా పరిగణలోకి తీసుకోవాలని ఆయన ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నారు. పీస్ రేటు కార్మికుల వీరిని డిపార్ట్మెంట్లో నామకరణం చేయడం జరిగింది.

కానీ బిల్లింగ్ చేయడంలో వీరి పాత్ర కంపెనీకి చాలా కీలకంగా ఉన్న విషయాన్ని యాజమాన్యం గుర్తించడంలో విఫలమైందని ఆయన చేశారు. కావున ఇప్పటికైనా వీరి సమస్యను పరిష్కరించడంలో యాజమాన్యం పునః పరిశీలించాల్సిందిగా ఆయన డిమాండ్ చేశారు.

క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న ఓ అండ్ ఎం ఉద్యోగులు విధినిర్వహణలో భద్రత ప్రమాణాలు పాటించాలని 327 ప్రధాన కార్యదర్శి శ్రీధర్ కోరారు. ఈ కార్యక్రమంలో కంపెనీ సెక్రటరీ భూపాల్ రెడ్డి, రీజినల్ ప్రెసిడెంట్ కే.ఎల్. శ్రీనివాస్, రీజినల్ సేక్రటరీ ఎం.డి. మహామ్ముద్, రీజీనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ భీమ్ , డివిజన్ అడిషనల్ సెక్రెటరీ మహాబూబ్ పాషా సర్కిల్ కార్మికులు పాల్గొన్నారు.

P.HANMANTHU, NARAYANAPETA

P.HANMANTHU, NARAYANAPETA