Narayanpet: కొత్తపల్లి, గుండుమల్‌లో పీఎస్‌ల ఏర్పాటుకు స్థల పరిశీలన!

Narayanpet: నారాయణపేట జిల్లా కొత్తపల్లి, గుండుమల్ మండలాల్లో నూతన పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు అనువైన స్థలాలను జిల్లా ఎస్పీ డా. వినీత్ స్వయంగా పరిశీలించారు.

P.HANMANTHU, NARAYANAPETA
Published on: 30 Oct 2026 10:58 AM IST
Narayanpet
X

Narayanpet: కొత్తపల్లి, గుండుమల్‌లో పీఎస్‌ల ఏర్పాటుకు స్థల పరిశీలన!

నారాయణపేట: నారాయణపేట జిల్లా లోని మద్దూర్, కోస్గి పరిధిలో కొత్తపల్లి, గుండుమల్ నూతన పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు సంబంధించి జిల్లా ఎస్పీ డా. వినీత్ ఆయా మండలాల్లో స్థలాలను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు అనువైన స్థలాలు, భౌగోళిక పరిస్థితులు, ప్రజలకు అందుబాటులో ఉండే విధానం తదితర అంశాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు పోలీస్ సేవలను మరింత చేరువ చేయడం, శాంతిభద్రతల పరిరక్షణను బలోపేతం చేయడం, నేరాల నియంత్రణతో పాటు ప్రజలకు వేగవంతమైన పోలీస్ సేవలు అందించడమే లక్ష్యంగా నూతన పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఆయా పోలీస్ స్టేషను లను ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండేలా, ఆయా ప్రాంతాల అవసరాలకు అనుగుణంగా స్థలాల ఎంపికపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు.

నూతన పోలీస్ స్టేషన్ల ఏర్పాటుతో ఆయా గ్రామాలు, పరిసర ప్రాంతాల ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ కావడంతో పాటు, ఫిర్యాదులపై తక్షణ స్పందన, నేరాల నివారణ, శాంతిభద్రతల పరిరక్షణలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు అవకాశం ఉంటుందని ఎస్పీ తెలిపారు.

SP వెంట డీఎస్పీ నల్లపు లింగయ్య, సీఐ సైదులు, ఎస్సై లు విజయ్ కుమార్, చంద్ర శేఖర్, ప్రజా ప్రతినిధులు అధికారులు తది తరులు పాల్గొన్నారు.

P.HANMANTHU, NARAYANAPETA

P.HANMANTHU, NARAYANAPETA