Narayanpet: అర్నాబ్ తుఫాన్ బాధితులకు విద్యుత్ పునరుద్ధరణ
Narayanpet: ఆంధ్రప్రదేశ్లో అర్నాబ్ తుఫాన్ వేళ కరెంటు పునరుద్ధరించిన నారాయణపేట విద్యుత్ అధికారులను, కార్మికులను సన్మానించిన ఎస్ఈ బి.నవీన్ కుమార్.
Narayanpet: అర్నాబ్ తుఫాన్ బాధితులకు విద్యుత్ పునరుద్ధరణ
నారాయణపేట: ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో అర్నాబ్ తూఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో తుఫాను ప్రభావం తో విద్యుత్ పోల్స్ విరిపోయి అక్కడి గ్రామాలు చీకటి తో ఉన్నందున తెలంగాణ రాష్ట్రం నారాయణపేట సర్కిల్ నుండి వెళ్ళి మన విద్యుత్ ఏ.ఈ. లు నాగశేఖర్ రెడ్డి ( డి.పి. ) , కన్స్ట్రక్షన్ ఏ.ఈ. బానోదయ్ లు వీరి వెంబడి కాంట్రాక్టర్ కృష్ణ మరో 23 మంది కార్మికులు వెళ్ళి పునరుద్ధరణ పనులు చేసి నందున నారాయణపేట సర్కిల్ తరపున సూపరింటెండెంట్ ఇంజనీర్ బి.నవీన్ కూమార్ ఆధ్వర్యంలో శాలువా, సర్టీఫీకెట్ తో సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్.ఈ. నవీన్ కుమార్ మాట్లాడుతూ ఆపద సమయంలో ప్రక్క రాష్ట్రం ప్రజలు ఇబ్బందులతో ఉన్నప్పుడు మానవతా దృక్పథంతో మా పై అధికారుల ఆదేశం మేరకు ఇక్కడి నుండి నారాయణపేట సర్కిల్ తరపున మా వంతు తరపున అక్కడ ప్రజలకు కరెంటు సరఫరా అందించేందుకు వెళ్ళిన సిబ్బందికి అభినందన సభ ఏర్పాటు చేసి సన్మానం చేశారు.
ఈ సందర్భంగా ఆపరేషన్ డి.ఈ శ్రీనివాస్ మాట్లాడుతూ తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో ప్రతి రోజు పునరుద్ధరణ పనుల్లో కార్మికులు మంచిగా పని చేసి అక్కడి ప్రజల మన్ననలు పోదటం మన రాష్ట్రానికి గర్వకారణం అన్నారు.
ప్రతి ఉద్యోగి తన విధినిర్వహణలో ప్రకృతి విపత్తులో పాల్గోనటం పూర్వజన్మ సుకృతం అని డి.ఈ.టి. సభావత్ రాజు నాయక్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏ.డి. ప్రదీప్ కుమార్, ఏఈ మహేష్ గౌడ్, రూరల్ ఏఈ సాయినాథ్ రెడ్డి, ఏ.ఈ.టి. వెంకటకృష్ణ రెడ్డి, సతీష్, జె.ఏ.ఓ. గోవర్దన్ , సర్కిల్, ఈ.ఆర్.ఓ. సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




