Narayanpet: పోలీసు అమరుల త్యాగాలు మరువలేనివి: ఎస్ఐ గాయత్రి!
Narayanpet: నారాయణపేటలో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా ఎస్ఐ గాయత్రి ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. అమరుల త్యాగాలు మరువలేనివని కొనియాడారు.
Narayanpet: పోలీసు అమరుల త్యాగాలు మరువలేనివి: ఎస్ఐ గాయత్రి!
నారాయణపేట: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నారాయణపేట జిల్లా కేంద్రంలోని చిట్టెం నర్సిరెడ్డి మెమోరియల్ డిగ్రీ కళాశాల మరియు కేజీబీవీ గురుకుల పాఠశాల, కళాశాలలో టౌన్ SI 2 గాయత్రి ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టడంలో పోలీసుల పాత్ర మరియు తెలంగాణను మాదకద్రవ్య రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో నా పాత్ర. అనే అంశాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించి పలు సామాజిక అంశాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మాదకద్రవ్యాల వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక నష్టాల గురించి అవగాహన కల్పించి విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించబడ్డాయి.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు పోలీస్ అమరవీరుల త్యాగాలు, సేవాస్ఫూర్తి, ప్రజాసేవలో పోలీసులు స్ఫూర్తిని పెంపొందించడం, అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం ఈ పోటీల ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు.ఈ సందర్భంగా ఎస్ఐ గాయత్రి మాట్లాడుతూ “పోలీస్ అమరవీరుల త్యాగాల ఫలితంగానే నేడు మనం ప్రశాంతంగా విద్యార్థులు వారి సేవా భావాన్ని గుర్తుంచుకోవాలి” అని పేర్కొన్నారు. విజేతలను రాష్ట్రస్థాయి వ్యాసరచన పోటీలకు పంపించడం జరుగుతుందని ఎస్ఐ తెలిపారు.




