Narayanpet: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి: ఎంఏ రషీద్!

Narayanpet: నారాయణపేట మైనారిటీ బాలుర గురుకుల పాఠశాలను జిల్లా అధికారి ఎంఏ రషీద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం, విద్య అందించాలని ఆదేశించారు.

P.HANMANTHU, NARAYANAPETA
Published on: 3 Nov 2026 10:16 PM IST
Narayanpet
X

Narayanpet: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి: ఎంఏ రషీద్!

నారాయణపేట: నారాయణపేట జిల్లా... విద్యార్థులకు సరిపడా నాణ్యమైన భోజనము అందించాలని జిల్లా మైనారిటీ అధికారి ఎంఏ రషీద్ ఆదేశించారు. మంగళవారం తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ సొసైటీ బాలుర గురుకుల నారాయణపేట పాఠశాలను జిల్లా కలెక్టర్ సిహెచ్ ప్రియాంక ఆదేశాల మేరకు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల హాజరు రిజిస్టర్ పరిశీలించారు.

విద్యార్థులకు అందించే ఆహారం సరుకులు స్టాక్ రిజిస్టర్ ద్వారా ఉన్న స్టాకును తనిఖీ చేసి నాణ్యమైన సరుకులు కొనుగోలు చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనంతోపాటు విద్యను అందించే విధంగా ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ విద్యార్థులకు పెద్దపీట వేసిందని వారి విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నదని ఆయన తెలిపారు.కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

P.HANMANTHU, NARAYANAPETA

P.HANMANTHU, NARAYANAPETA