Makthal: మక్తల్‌లో అండర్-19 కరాటే పోటీలు: మంత్రి శ్రీహరి!

Makthal: మక్తల్‌లో ఉమ్మడి పాలమూరు జిల్లా స్థాయి అండర్-19 కరాటే పోటీలను మంత్రి వాకిటి శ్రీహరి ప్రారంభించారు.

B. NARENDER, MAKTHAL
Published on: 15 Oct 2026 4:46 PM IST
Makthal
X

Makthal: మక్తల్‌లో అండర్-19 కరాటే పోటీలు: మంత్రి శ్రీహరి!

మక్తల్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్థాయి అండర్‌-19 బాలబాలికల కరాటే పోటీలను మక్తల్ పట్టణంలో మంత్రి వాకిటి శ్రీహరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరాటే ఆత్మరక్షణతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని అన్నారు.

ముఖ్యంగా బాలికలు ఆత్మరక్షణ నైపుణ్యాలను నేర్చుకోవాలని సూచించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.

గ్రామీణ ప్రాంత క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు పోటీలు దోహదపడతాయని పేర్కొన్నారు. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ పట్టుదలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

B. NARENDER, MAKTHAL

B. NARENDER, MAKTHAL