Makthal: మంథన్‌గోడ్‌లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం!

Makthal: నారాయణపేట జిల్లా మక్తల్ మండలం మంథన్‌గోడ్ గ్రామ పంచాయతీలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు ఘనంగా ప్రారంభించారు.

B. NARENDER, MAKTHAL
Published on: 21 Nov 2026 4:40 PM IST
Makthal
X

Makthal: మంథన్‌గోడ్‌లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం!

మక్తల్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఏ. రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ వాకిటి శ్రీహరి ఆదేశానుసారం, మంథన్ గోడ్ గ్రామ పంచాయతీ నందు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ఘనంగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో గౌరవ సర్పంచ్ రాజేందర్ గౌడ్, ఉప సర్పంచ్ కురువ సాబన్న, వార్డు సభ్యులు, మక్తల్ మార్కెట్ వైస్ చైర్మన్ బి. గణేష్ కుమార్, గౌరవ ఎంపీడీవో రమేష్, పంచాయతీ కార్యదర్శి అచ్యుతానంద, స్పెషల్ ఆఫీసర్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు ఎల్. చందర్, కాంగ్రెస్ పార్టీ పాల కృష్ణయ్య ముదిరాజ్ సీనియర్ నాయకులు మరియు మంథన్ గోడ్ గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ పథకానికి ఎవరు అర్హులు అంటే

18 ఏళ్ల నుండి 59 ఏళ్ల వయసు గల ప్రతి ఒక్కరూ ఈ పథకానికి అర్హులు.

గతంలో రైతు బీమా భూమి ఉంటేనే వచ్చేది. ఇప్పుడు భూమి లేకున్నా, రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఈ పథకం వర్తిస్తుంది.

కుటుంబ పెద్దను కోల్పోయినా, కుటుంబంలో ఎవరిని కోల్పోయినా, ఈ బీమా పథకం ద్వారా ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా లభిస్తుంది.

అప్లికేషన్ కు కావాల్సినవి కేవలం ఈ మూడు మాత్రమే:

1. రేషన్ కార్డు

2. ఆధార్ కార్డు

3. మొబైల్ నంబర్

అవసరమవుతాయని,శ్రీనివాసులు గౌడ్ మక్తల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తెలిపారు.

B. NARENDER, MAKTHAL

B. NARENDER, MAKTHAL