Makthal: లింగంపల్లి సబ్‌స్టేషన్‌లో 8 MVA పవర్ ట్రాన్స్‌ఫార్మర్!

Makthal: మక్తల్ మండలం లింగంపల్లి సబ్‌స్టేషన్‌లో లో-వోల్టేజ్ సమస్య పరిష్కారానికి 5 MVA స్థానంలో నూతన 8 MVA పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌ను విద్యుత్ శాఖ అధికారులు ఏర్పాటు చేశారు.

B. NARENDER, MAKTHAL
Published on: 29 Oct 2026 7:24 PM IST
Makthal
X

Makthal: లింగంపల్లి సబ్‌స్టేషన్‌లో 8 MVA పవర్ ట్రాన్స్‌ఫార్మర్!

మక్తల్: లింగంపల్లి సబ్‌స్టేషన్ పరిధిలో విద్యుత్ సరఫరాలో తలెత్తుతున్న లో-వోల్టేజ్ సమస్యను పరిష్కరించేందుకు, ప్రస్తుతం ఉన్న 5 MVA పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌ను తొలగించి, దాని స్థానంలో నూతనంగా 8 MVA పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మార్పు ద్వారా విద్యుత్ సరఫరా మెరుగుపడటంతో పాటు, రైతులకు మరియు వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సేవలు అందించేందుకు అవకాశం కలుగుతుంది.

ఈ కార్యక్రమంలో SE నవీన్ కుమార్, DE శ్రీనివాసులు, AD విజయ్ భాస్కర్, AE వెంకటేష్, AE శ్రీనివాస్, AE అశోక్ మరియు లైన్‌మెన్లు చంద్రకాంత్, సిద్దు, మారుతి తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ సరఫరా నాణ్యతను మెరుగుపరచడం, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఈ చర్య చేపట్టడం జరిగింది.

B. NARENDER, MAKTHAL

B. NARENDER, MAKTHAL