Makthal: గుడిగండ్లలో ఇందిరమ్మ జీవిత కుటుంబ బీమా పథకం ప్రారంభం!

Makthal: నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గుడిగండ్ల గ్రామ పంచాయతీ కార్యాలయంలో మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు ఇందిరమ్మ జీవిత కుటుంబ బీమా పథకాన్ని ఘనంగా ప్రారంభించారు.

B. NARENDER, MAKTHAL
Updated on: 23 Nov 2026 11:40 AM IST
Makthal
X

Makthal: గుడిగండ్లలో ఇందిరమ్మ జీవిత కుటుంబ బీమా పథకం ప్రారంభం!

మక్తల్: తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని, సిద్దిపేటలో ప్రారంభించారు. మంత్రివర్యులు శ్రీ వాకిటి శ్రీహరి గారి ఆదేశాల మేరకు, గుడిగండ్ల గ్రామపంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ జీవిత కుటుంబ బీమా పథకం ఘనంగా ప్రారంభం చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో గుడిగండ్ల సర్పంచ్ శ్రీనివాసులు గౌడ్, ఉప సర్పంచ్ సి.పి. బాలకృష్ణ, కూసుర్ రాజు, వార్డు మెంబర్ రమేష్, డీలర్ చంద్రశేఖర్,మేకల రాజు వార్డు నంబరు మంగమ్మ నరసింహులు సభ్యులు, మహిళలు పాల్గొని, లబ్ధిదారులకు బీమా పత్రాలను అందజేశారు. ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి భరోసా లభిస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకంలో చేరాలని సర్పంచ్ గారు కోరారు.

అర్హత: 18 ఏళ్ల నుండి 59 ఏళ్ల వరకు ప్రతి ఒక్కరూ ఈ పథకానికి అర్హులు. కావలసినవి డాక్యుమెంట్లు : ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మొబైల్ నెంబర్ మాత్రమే అవసరం అవుతాయని శ్రీనివాసులు గౌడ్ మక్తల్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తెలిపారు.

B. NARENDER, MAKTHAL

B. NARENDER, MAKTHAL