Maktal: బాణాసంచా షాపుల వద్ద భద్రత ముఖ్యం: సీఐ రామ్‌లాల్!

Maktal: మక్తల్ పోలీస్ స్టేషన్‌లో బాణాసంచా దుకాణదారులకు సీఐ రామ్‌లాల్ భద్రతా నిబంధనలు వివరించారు. లైసెన్స్ లేని షాపులపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.

B. NARENDER, MAKTHAL
Published on: 6 Nov 2026 6:54 PM IST
Maktal
X

Maktal: బాణాసంచా షాపుల వద్ద భద్రత ముఖ్యం: సీఐ రామ్‌లాల్!

మక్తల్: నారాయణపేట జిల్లా మక్తల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో నేడు దీపావళి పండుగ నేపథ్యంలో బాణాసంచా విక్రయించే దుకాణాల నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని మక్తల్ సిఐ రామ్ లాల్ సూచించారు. లాభాల కంటే ప్రజల ప్రాణాలు, ఆస్తులు, భద్రతకే ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. బాణాసంచా విక్రయాలకు సంబంధిత శాఖ నుండి చట్టబద్ధమైన అనుమతులు లైసెన్సులు పొందాలని అనుమతి లేని షాపులపై తప్పనిసరి చర్యలు ఉంటాయని మక్తల్ సీఐ తెలిపారు.

ప్రతి దుకాణంలో అగ్నిమాపక పరికరాలు ఇసుక బకేట్లు, నీటి డ్రమ్ములు, అందుబాటులో ఉంచుకోవాలని పరిసరాల్లో ధూమపానం, అగ్గిపుల్లలు వెలిగించడం నిషేధమని,విద్యుత్ సర్క్యూట్ జరగకుండా వైరింగ్ విద్యుత్ పరికరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం అనుమతించిన నాణ్యత మైన బానసంచ మాత్రమే విక్రయించాలని నిషేధిత బాన సంచ అమ్మక లు చేపట్టరాదని హెచ్చరించారు.

చిన్నపిల్లలు పెద్దల పర్యవేక్షణలో బాణాసంచా కొనుగోలు చేసేలా చూడాలని, పోలీస్, అగ్నిమాపక అత్యవసర నెంబర్లు అందరికీ కనిపించేలా ప్రదర్శించాలని సూచించారు, నిబంధనలు ఉల్లంఘించి విక్రయాలు చేపట్టే నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు, చిన్నపాటి నిర్లక్ష్యం కూడా భారీ ప్రమాదానికి దారి తీస్తుందని కావున ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ఇట్టి కార్యక్రమంలో బాణాసంచా దుకాణదారులు, మక్తల్ ఎస్సై పి. రాజు, మక్తల్ ఫైర్ స్టేషన్ ఇంచార్జ్ నరేష్ ఇతర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

B. NARENDER, MAKTHAL

B. NARENDER, MAKTHAL