Narayanpet: అక్రమంగా ఇసుక తరలిస్తున్న 4 టిప్పర్ల సీజ్!

Narayanpet: నారాయణపేట సింగారం గ్రామ స్టేజి వద్ద అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు టిప్పర్లను టాస్క్‌ఫోర్స్, టౌన్ పోలీసులు పట్టుకుని కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

P.HANMANTHU, NARAYANAPETA
Published on: 3 Nov 2026 10:23 PM IST
Narayanpet
X

Narayanpet: అక్రమంగా ఇసుక తరలిస్తున్న 4 టిప్పర్ల సీజ్!

నారాయణపేట: నారాయణపేట పట్టణంలోని సింగారం గ్రామ స్టేజి వద్ద అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు టిప్పర్లను టాస్క్ ఫోర్స్, టౌన్ పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో సరైన అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న నాలుగు టిప్పర్లను గుర్తించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా టౌన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... పట్టుబడిన నాలుగు టిప్పర్ల డ్రైవర్లను విచారించి డ్రైవర్లు ఓనర్లపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.

P.HANMANTHU, NARAYANAPETA

P.HANMANTHU, NARAYANAPETA