Narayanpet: అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: అదనపు ఎస్పీ రియాజ్!

Narayanpet: నారాయణపేట జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో అక్టోబర్ 21 పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అదనపు ఎస్పీ రియాజ్ హుల్ హక్ ఆధ్వర్యంలో పరేడ్ రిహార్సల్స్ నిర్వహించారు.

P.HANMANTHU, NARAYANAPETA
Published on: 19 Oct 2026 8:09 PM IST
Narayanpet
X

Narayanpet: అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: అదనపు ఎస్పీ రియాజ్!

నారాయణపేట: ఈ నెల అక్టోబర్ 21న నిర్వహించనున్న పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని నారాయణపేట జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో అదనపు ఎస్పీ MD రియాజ్ హుల్ హక్ ఆధ్వర్యంలో స్మృతి పరేడ్ రిహార్సల్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ విజయభాస్కర్ పరేడ్ కమాండర్‌గా వ్యవహరించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది పరేడ్‌లో పాల్గొని స్మృతి పరేడ్‌కు సంబంధించిన విధివిధానాలను సాధన చేశారు.

ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ... విధి నిర్వహణలో భాగంగా దేశ భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన పోలీస్ అమరవీరుల సేవలు, త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ప్రజల రక్షణ, సమాజంలో శాంతిభద్రతల స్థాపన కోసం అమరవీరులు చేసిన సేవలు పోలీస్ శాఖకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని తెలిపారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని గౌరవప్రదంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు.

స్మృతి పరేడ్‌లో క్రమశిక్షణ, సమన్వయం, గౌరవ వందనం వంటి అంశాలను పక్కాగా సాధన చేసి, అమరవీరులకు ఘనంగా నివాళులర్పించేలా ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. విధి నిర్వహణలో పోలీస్ అమరవీరులు చూపిన ధైర్యసాహసాలు, అంకితభావం, సేవా స్ఫూర్తిని ప్రతి పోలీస్ సిబ్బంది ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

P.HANMANTHU, NARAYANAPETA

P.HANMANTHU, NARAYANAPETA