Narayanpet: వాల్మీకి ఆశయాలు అందరికీ స్ఫూర్తిదాయకం: డీఎస్పీ మహేష్!

Narayanpet: నారాయణపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో మహర్షి వాల్మీకి జయంతిని ఘనంగా నిర్వహించారు. డీసీఆర్‌బీ డీఎస్పీ ఏ. మహేష్ వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

P.HANMANTHU, NARAYANAPETA
Published on: 26 Oct 2026 8:19 PM IST
Narayanpet
X

Narayanpet: వాల్మీకి ఆశయాలు అందరికీ స్ఫూర్తిదాయకం: డీఎస్పీ మహేష్!

నారాయణపేట: మహర్షి వాల్మీకి జయంతిని పురస్కరించుకుని నారాయణపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో డీసీఆర్‌బీ డీఎస్పీ ఏ. మహేష్ మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మహేష్ మాట్లాడుతూ మహర్షి వాల్మీకి సంస్కృతంలో ఆదికావ్యమైన రామాయణాన్ని రచించి ప్రపంచానికి ధర్మం, సత్యం, న్యాయం, మానవతా విలువలను చాటిచెప్పారని పేర్కొన్నారు.

శ్రీరాముడి జీవిత విశేషాల ద్వారా సమాజానికి నైతిక విలువలు, ఆదర్శవంతమైన జీవన విధానం, కర్తవ్యనిష్ఠ వంటి గొప్ప సందేశాలను అందించారని తెలిపారు.మహర్షి వాల్మీకి జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని, ఆయన బోధించిన విలువలను ఆచరణలో పెట్టి సమానత్వం, సోదరభావం, సామాజిక సామరస్యంతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

మహనీయుల జయంతులను జరుపుకోవడం ద్వారా వారి ఆశయాలను భావితరాలకు అందించడంతో పాటు వారి సేవలను స్మరించుకోవడం మనందరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు, ఆర్ముడు రిజర్వ్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

P.HANMANTHU, NARAYANAPETA

P.HANMANTHU, NARAYANAPETA