Narayanpet: నారాయణపేటలో ఘనంగా జిల్లా స్థాయి రోల్ ప్లే పోటీలు!
Narayanpet: నారాయణపేట పీఎం శ్రీ ఉన్నత పాఠశాలలో ఎస్సీఈఆర్‌టీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి రోల్ ప్లే పోటీలు ఘనంగా జరిగాయి. విజేతలకు ఏఎంవో విద్యాసాగర్ బహుమతులు అందజేశారు.
Narayanpet: నారాయణపేటలో ఘనంగా జిల్లా స్థాయి రోల్ ప్లే పోటీలు!
నారాయణపేట: నారాయణపేట జిల్లా కేంద్రంలో SCERT తెలంగాణ, జనాభా విద్యా విభాగం (PEC) ఆధ్వర్యంలో జిల్లా స్థాయి రోల్ ప్లే పోటీలు PM SHRI ప్రభుత్వ ఉన్నత పాఠశాల గ్రౌండ్ లో నిర్వహించారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఆరోగ్యం, మానసిక శ్రేయస్సు, లింగ సమానత్వం, బాధ్యతాయుత పౌరసత్వం తదితర అంశాలపై పాత్రధారణల ద్వారా తమ ప్రతిభను చాటుకున్నారు.
ఈ కార్యక్రమానికి AMO విద్యాసాగర్ చే ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. బహుమతులు పొందిన విద్యార్థులు ప్రథమ బహుమతి: KGBV, మరికల్ .ద్వితీయ బహుమతి: ZPHS, దామర్‌గిద్ద.
తృతీయ బహుమతి: GHS గ్రౌండ్, నారాయణపేట
ఈ సందర్భంగా AMO విద్యాసాగర్ కె మాట్లాడుతూ, రోల్ ప్లే వంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, సంభాషణా నైపుణ్యాలు, బృంద స్ఫూర్తి, సామాజిక బాధ్యతను పెంపొందిస్తాయని తెలిపారు. బహుమతి సాధించడం ఒక విజయమైతే, ధైర్యంగా పాల్గొని కొత్త విషయాలను నేర్చుకోవడం కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు. విద్యార్థులు నిరంతర సాధనతో ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని ప్రోత్సహించారు.
ఈ కార్యక్రమంలో జనాభా విద్యా విభాగం కోఆర్డినేటర్లు శ్రీ కనకప్ప, శ్రీ నర్సప్ప, శ్రీమతి గిరిజ పాల్గొని పోటీల నిర్వహణలో సమన్వయం చేశారు. కార్యక్రమ విజయానికి సహకరించిన ఉపాధ్యాయులు, సమన్వయకర్తలను అధికారులు అభినందించారు.




