Narayanpet: నారాయణపేటలో ఉపాధ్యాయులకు పోక్సో చట్టంపై ప్రత్యేక శిక్షణ!
Narayanpet: నారాయణపేట జిల్లా కోర్టులో DLSA ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు సురక్షిత్ బచ్పన్ అభియాన్, పోక్సో చట్టంపై ఒకరోజు శిక్షణ నిర్వహించారు. సైబర్ నేరాల పోస్టర్లను ఆవిష్కరించారు.
Narayanpet: నారాయణపేటలో ఉపాధ్యాయులకు పోక్సో చట్టంపై ప్రత్యేక శిక్షణ!
నారాయణపేట: జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ (DLSA), నారాయణపేట ఆధ్వర్యంలో “సురక్షిత్ బచ్పన్ అభియాన్” - పోక్సో చట్టం, 2012 పై పాన్-ఇండియా పాఠశాల అవగాహన కార్యక్రమంలో భాగంగా, గురువారం జిల్లా కోర్టు కాంప్లెక్స్ లో ఉపాధ్యాయులకు ఒక రోజు సెన్సిటైజేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గౌరవ సీనియర్ సివిల్ జడ్జి - cum - FAC సెక్రటరీ, DLSA, నారాయణపేట శ్రీమతి వింధ్య నాయక్, నారాయణపేట గారు అధ్యక్షత వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల నుండి నామినేట్ అయిన 198 మంది టీచర్స్-ఇన్-చార్జ్ లు పాల్గొన్నారు. నవంబర్ 9న లీగల్ సర్వీసెస్ డే సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి - cum - FAC సెక్రటరీ, DLSA, నారాయణపేట శ్రీమతి వింధ్య నాయక్ గారు మాట్లాడుతూ, లీగల్ సర్వీసెస్ డే యొక్క ప్రాముఖ్యతను, ప్రతి పౌరుడికి ఉచిత న్యాయ సహాయం పొందే హక్కు ఉందని, ప్రజలకు ఉచిత న్యాయ సహాయం ఎవరికి లభిస్తుంది, DLSA లో ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఫ్రంట్ ఆఫీస్, లీగల్ ఎయిడ్ క్లినిక్ ల ద్వారా ఎలా సహాయం పొందాలి, లోక్ అదాలత్ ద్వారా కేసుల పరిష్కారం గురించి వివరంగా తెలియజేశారు.
పిల్లల హక్కులు, పిల్లల రక్షణలో ఉపాధ్యాయుల పాత్ర, పోక్సో చట్టం గురించి వివరించారు. అదే విధంగా పిల్లలపై జరిగే లైంగిక వేధింపులను ఎలా గుర్తించాలి, వెంటనే ఎవరికి తెలియజేయాలి, పిల్లలను ఎలా కాపాడాలి అనే నియమాలపై కూడా న్యాయవాదులు ఉపాధ్యాయులకు క్షుణ్ణంగా శిక్షణ ఇచ్చారు.
చివరగా న్యాయమూర్తిగారు మాట్లాడుతూ గౌరవనీయులైన హైకోర్టు మరియు నారాయణపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీ బోయ శ్రీనివాసులు ఆదేశాల మేరకు సురక్షిత్ బచ్పన్ అభియాన్ - పోక్సో చట్టం 2012 పై పాన్-ఇండియా భాగంగా తేదీ 16 నుండి ఈ నెల 31 వరకు జిల్లాలోని పాఠశాల అవగాహన కార్యక్రమలు ట్రేనింగ్ చేయబడిన/ నామినేట్ అయిన 198 మంది టీచర్స్-ఇన్-చార్జ్ని టీచర్స్ , ప్యానెల్ అడ్వొకేట్స్, పారాలీగల్ వాలంటీర్స్ అవగాహన కార్యక్రమలు నిర్వహించాలని ఆదేశించారు. తదుపారి వందన సమర్పణ చేస్తూ సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక అవగాహన పోస్టర్లను విడుదలచేశారు.
ఈ కార్యక్రమంలో కె. లక్ష్మీపతి గౌడ్, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్, గోవింద రాజు, జిల్లా విద్యా శాఖ అధికారి (DEO), అశోక్ శ్యామల, చైర్పర్సన్, బాలల సంక్షేమ కమిటీ (CWC), కరిష్మా, జిల్లా బాలల పరిరక్షణ అధికారి (DCPO), నరసింహ, ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్, చైల్డ్ లైన్, ప్రమీల , భరోసా సెంటర్, ఎన్. కవిత, సైకో సోషల్ కౌన్సిలర్, సఖి సెంటర్, రమేష్ సైబర్ క్రైమ్స్ డిపార్ట్మెంట్కా, ప్యానెల్ అడ్వొకేట్స్, పారాలీగల్ వాలంటీర్స్ర్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల నుండి 198 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు.




