Narayanpet: నారాయణపేట మెడికల్ కాలేజీలో ఘనంగా 7వ రోజు బతుకమ్మ సంబరాలు
Narayanpet: నారాయణపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 7వ రోజు బతుకమ్మ సంబరాలు. ప్రిన్సిపాల్ డాక్టర్ సంపత్ కుమార్ సింగ్, వైద్యులు, మహిళా సిబ్బంది ఉత్సాహంగా భక్తిశ్రద్ధలతో భాగస్వామ్యం.
Narayanpet: నారాయణపేట మెడికల్ కాలేజీలో ఘనంగా 7వ రోజు బతుకమ్మ సంబరాలు
నారాయణపేట: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగలో భాగంగా నారాయణపేట ప్రభుత్వ మెడికల్ కాలేజ్ మరియు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ప్రాంగణంలో 7వ రోజు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు.
ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. సంపత్ కుమార్ సింగ్, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ ఆదిత్య, డాక్టర్ బాలాజీ, డాక్టర్ రాఘవేంద్ర ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులు సంప్రదాయబద్ధమైన రంగురంగుల చీరలు ధరించి, వివిధ రకాల పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతి ప్రేమకు, మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.
ఈ వేడుకల్లో వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది, మహిళా ఉద్యోగులు పాల్గొని బతుకమ్మ పాటలతో పండుగ వాతావరణాన్ని మరింత శోభాయమానంగా మార్చారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో ఇటువంటి వేడుకలు కీలక పాత్ర పోషిస్తాయని ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. సంపత్ కుమార్ సింగ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.




