Narayanpet: నారాయణపేట పోలీస్ స్టేషన్‌లో మహిళా కానిస్టేబుల్‌కు ఘనంగా శ్రీమంతం

Narayanpet: నారాయణపేట పోలీస్ స్టేషన్‌లో విధి నిర్వహణలో ఉన్న మహిళా కానిస్టేబుల్ శిరీషకు కుటుంబ సభ్యుల మాదిరిగా ఘనంగా శ్రీమంతం వేడుక నిర్వహించిన పోలీస్ అధికారులు.

P.HANMANTHU, NARAYANAPETA
Updated on: 12 Nov 2026 9:59 PM IST
Narayanpet
X

Narayanpet: నారాయణపేట పోలీస్ స్టేషన్‌లో మహిళా కానిస్టేబుల్‌కు ఘనంగా శ్రీమంతం

నారాయణపేట: నారాయణపేట...విధి నిర్వహణలో ఎదురయ్యే ఒత్తిళ్లు, సవాళ్ల మధ్య పోలీస్ సిబ్బంది ఒకరికొకరు కుటుంబ సభ్యుల్లా అండగా నిలుస్తూ ఆప్యాయతను పంచుకుంటారనే దానికి నారాయణపేట పోలీస్ స్టేషన్‌లో జరిగిన కార్యక్రమం నిదర్శనంగా నిలిచింది.

నారాయణపేట పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ శిరీష ప్రస్తుతం ఏడు నెలల గర్భిణిగా ఉన్నారు. ఈ సందర్భంగా గురువారం పోలీస్ స్టేషన్‌లో ఆమెకు శ్రీమంతం వేడుకను ఘనంగా నిర్వహించారు. సీఐ శివశంకర్, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మహిళా ఎస్‌ఐ గాయత్రి, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది కలిసి సంప్రదాయబద్ధంగా శ్రీమంతం వేడుకను నిర్వహించి ఆమెను ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా శిరీషకు చీర, పూలు, పండ్లు అందజేసి కుటుంబ సభ్యుల మాదిరిగా ఆప్యాయంగా శుభాకాంక్షలు తెలిపారు. విధి నిర్వహణలో ఎల్లప్పుడూ బిజీగా ఉండే పోలీస్ అధికారులు, సిబ్బంది తమ సహోద్యోగి జీవితంలో ఎంతో ప్రత్యేకమైన ఈ సందర్భాన్ని గుర్తించి శ్రీమంతం వేడుకను నిర్వహించడం పోలీస్ శాఖలోని ఆత్మీయత, ఐక్యత, పరస్పర సహకారానికి నిదర్శనంగా నిలిచింది.

తనకు పోలీస్ స్టేషన్‌లోని ఉన్నతాధికారులు, సహచర సిబ్బంది కుటుంబ సభ్యుల్లా అండగా నిలిచి, తన శ్రీమంతం వేడుకను ఇంత ఘనంగా నిర్వహించడం పట్ల మహిళా కానిస్టేబుల్ శిరీష ఆనందం వ్యక్తం చేస్తూ పోలీస్ అధికారులకు, సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

P.HANMANTHU, NARAYANAPETA

P.HANMANTHU, NARAYANAPETA