Narayanpet: రైతు మేళాను విజయవంతం చేయాలి: కలెక్టర్ ప్రియాంక!

Narayanpet: కొడంగల్ నియోజకవర్గం హకీంపేటలో జరిగే రైతు మేళాకు రైతులను తరలించేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని నారాయణపేట జిల్లా కలెక్టర్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. సీఎం హాజరు.

P.HANMANTHU, NARAYANAPETA
Published on: 3 Nov 2026 10:08 PM IST
Narayanpet
X

Narayanpet: రైతు మేళాను విజయవంతం చేయాలి: కలెక్టర్ ప్రియాంక!

నారాయణపేట: కొడంగల్ నియోజకవర్గంలోని హకీం పేటలో ఈ నెల 7 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించనున్న రైతు మేళా కార్యక్రమానికి నారాయణపేట జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో రైతులను తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక అధికారులను ఆదేశించారు.

ఈ రైతు మేళా కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి హాజరుకానున్న నేపథ్యంలో జిల్లా నుంచి రైతులను తరలించేందుకు పకడ్బందీ ప్రణాళిక రూపొందించాలని సూచించారు.ఈ మేరకు మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా అధికారులతో కలెక్టర్ ప్రియాంక సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా రైతు మేళాకు రైతులను తరలించేందుకు మండలాల వారీగా అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని, ప్రతి మండలానికి ప్రత్యేక అధికారులను సమన్వయ బాధ్యతలు అప్పగించాలని సూచించారు. రైతులకు రవాణా సౌకర్యం, ప్రయాణ ఏర్పాట్లు, భోజన వసతి తదితర అంశాలపై ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. రైతు మేళాకు వెళ్లే బస్సుల వివరాలు, బయలుదేరే సమయాలు, నిర్ణయించిన పికప్ పాయింట్లు, రైతుల సంఖ్య తదితర వివరాలను సంబంధిత యాప్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని తెలిపారు.

లైజనింగ్ అధికారులు బస్సుల సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ బస్సులు బయలుదేరినప్పటి నుంచి గమ్యస్థానానికి చేరుకునే వరకు పర్యవేక్షించాలన్నారు. జిల్లా స్థాయిలో ప్రత్యేక కంట్రోల్ పాయింట్ ఏర్పాటు చేసి, మూడు రోజుల పాటు అధికారుల బృందాలు అందుబాటులో ఉండాలని సూచించారు. రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి రైతు మేళా కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను విజయవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను,ట్రైనీ కలెక్టర్ ఫణి కుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియ నాయక్, ప్రజారోగ్య శాఖ ఎస్ ఈ విజయ్ భాస్కర్, డిఆర్డిఓ వెంకట్ రాములు, జెడ్పీ డిప్యూటీ సీ ఈ వో సుజాత, ఆర్టీవో మున్నీ, ఆర్ అండ్ బీ ఈ ఈ వెంకట రమణయ్య, పీ ఆర్ ఈ ఈ అశోక్ కుమార్, హౌసింగ్ పీడీ శంకర్ నాయక్, డీఈఓ గోవింద రాజులు, డీ ఎం వో బాలా మణి, కోస్గి మున్సిపల్ కమిషనర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

P.HANMANTHU, NARAYANAPETA

P.HANMANTHU, NARAYANAPETA