Narayanpet: అన్నదాతలకు రూ.62,370 కోట్ల ఎరువుల రాయితీ హర్షణీయం
Narayanpet: 2026-27 రబీ సీజన్‌కు కేంద్రం రూ.62,370 కోట్ల ఎరువుల రాయితీ ప్రకటించడం చారిత్రాత్మకమని బీజేపీ కిసాన్ మోర్చా నారాయణపేట జిల్లా అధ్యక్షులు వెంకట రాములు అన్నారు.
Narayanpet: అన్నదాతలకు రూ.62,370 కోట్ల ఎరువుల రాయితీ హర్షణీయం
నారాయణపేట: దేశ రైతుల సంక్షేమమే పరమావధిగా ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం 2026 27 రవి సీజన్ కు సంబంధించి ఎరువుల సబ్సిడీని భారీగా పెంచడం ఒక చారిత్రాత్మక నిదర్శనమని బిజెపి నారాయణపేట జిల్లా అధ్యక్షులు వెంకట రాములు ముదిరాజ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
అంతర్జాతీయ మార్కెట్లో ఎరువులు ముడి సరుకుల ధరలు విపరీతంగా పెరిగినప్పటికీ మన దేశ రైతులపై ఒక్క రూపాయి కూడా భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం ఏకంగా 62,370 కోట్ల రూపాయల ఎరువుల సబ్సిడీని ఆమోదించిందని ఆయన అన్నారు గత సీజన్ తో పోలిస్తే ఇది దాదాపు 64% ఎక్కువ అని పేర్కొన్నారు.
(అంటే అదనంగా 24 కోట్లు ఎక్కువ) . కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో రైతులకు 50 కిలోల డిఏపి బస్తా 1350 రూపాయలకే అలాగే 45 కిలోల యూరియా బస్తా 242 రూపాయలకే అందుబాటులో ఉంటాయని అన్నారు యాసంగిలో వరి మొక్కజొన్న పప్పు ధాన్యాలు సాగు చేసే తెలంగాణ రైతాంగానికి ఇది ఎంతో మేలు చేస్తుంది అన్నారు తెలంగాణ రైతుల పక్షాన ప్రధాని మోడీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ప్రకటించారు.
కేంద్ర ప్రభుత్వం ఇంత భారీ రాయితీతో అందిస్తున్న ఎరువులను బ్లాక్ మార్కెట్‌కు గాని వారి శ్రామిక అవసరాలకు గాని తరలిపోకుండా పారదర్శకంగా రైతులకు అందేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ట కార్యాచరణ రూపొందించాలని ఆయన డిమాండ్ చేశారు రాష్ట్రంలో పరిపాలన జాడి తప్పినందున నకిలీ ఎరువులు మార్కెట్లోకి వచ్చే ప్రమాదం ఉందని అధికారులు డీలర్లు కుమ్మక్కవ్వకుండా ప్రభుత్వం కఠిన నిఘా పెట్టాలని సూచించారు.
ఎల్ నేనో కారణంగా కరువు పరిస్థితులు వస్తాయని కేంద్రం గత ఏప్రిల్ నుంచే హెచ్చరించిన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి ముందస్తు ప్రణాళికలు చేయలేదని ఆయన విమర్శించారు బిజెపి కిసాన్ మోర్చా ఒత్తిడి మేరకు 365 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి చేతులు దులుపుకున్నదని విమర్శించారు.
కరువు మండలాలకు ఇప్పటివరకు ఎలాంటి ఆర్థిక సాయం గాని ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన గాని కల్పించకుండా కేవలం నివేదికలు తయారు చేసి కేంద్రంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. గత ఖరీఫ్ సీజన్ లో కరెంట్ కోతల మూలంగా పూర్తిగా చండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 30 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
దేశంలోని 24 రాష్ట్రాలలో అమలవుతున్న ప్రధానమంత్రి పర్సన్ బీమా యోజనను తెలంగాణలో కూడా తక్షణమే అమలుచేసి పంట నష్టపోయిన ప్రతి రైతుకు భీమా రక్షణ కల్పించాలని సూచించారు.
కరువు నిల్వల పేరుతో రాష్ట్రంలో సన్న బియ్యం ధరలను ధర్మంగా పెంచి పెను భారం మోపుతున్నారని ఆయన మండిపడ్డారు 25 కిలోల బియ్యం బస్తా పై అదనంగా 1500 వరకు వసూలు చేస్తూ 85 నుంచి 90 రూపాయలకు అమ్ముతున్నారని విమర్శించారు. పౌరసరఫరాల శాఖ మంత్రి రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించిన వెంటనే బియ్యం ధరలు పెరగడం వెనుక ప్రభుత్వ పెద్దలు, మిల్లర్లు కుమ్మక్కయ్యారని స్పష్టంగా తెలుస్తోందన్నారు.




