Veldanda: వెల్దండలో మహిళ అదృశ్యం.. కేసు నమోదు!
Veldanda: నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం చెదురుపల్లిలో 34 ఏళ్ల మహిళ కవిత అదృశ్యం సోదరుడి ఫిర్యాదుతో ఉమెన్ మిస్సింగ్ కేసు నమోదు చేసిన ఎస్సై యుగంధర్ రెడ్డి.
Veldanda: వెల్దండలో మహిళ అదృశ్యం.. కేసు నమోదు!
వెల్దండ: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోని చెదురుపల్లి గ్రామానికి, చెందిన 34 ఏళ్ల కవిత అదృశ్యమైన ఘటన చోటు చేసుకుంది. ఎస్సై యుగంధర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం. చేదురువల్లికి చెందిన పోలే విష్ణు సోదరి కవిత కొంతకాలంగా మతిస్థిమితం సరిగా లేక ఇంటి వద్ద ఉంటూ గ్రామంలో తిరిగి మళ్లీ ఇంటికి వచ్చేది.
అయితే గురువారం ఉదయం 5 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన కవిత తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. బంధువులు, తెలిసిన వారి వద్ద వెతికినా ఆచూకీ లభించకపోవడంతో ఆమె సోదరుడు విష్ణు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు ఉమెన్ మిస్సింగ్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై యుగంధర్ రెడ్డి తెలిపారు.




