Veldanda: పేదింటి ఆడబిడ్డ వివాహానికి గోలి శ్రీనివాస్ రెడ్డి చేయూత!

Veldanda: నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కుప్పగండ్ల గ్రామానికి చెందిన పేద కుటుంబ ఆడబిడ్డ వివాహానికి రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి రూ.10 వేలు ఆర్థిక సాయం అందించారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 12 Nov 2026 2:47 PM IST
Veldanda
X

Veldanda: పేదింటి ఆడబిడ్డ వివాహానికి గోలి శ్రీనివాస్ రెడ్డి చేయూత!

వెల్దండ: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కుప్పగండ్ల గ్రామానికి చెందిన జల్లెల మణెమ్మ, శ్రీనివాస్ దంపతుల కుమార్తె మేఘన వివాహం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద కుటుంబాలకు అండగా నిలవడం, ఆడబిడ్డల వివాహాలకు తమ వంతు సహకారం అందించడం సామాజిక బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు.

ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు సహాయ సహకారాలు అందించడం ద్వారా వారి జీవితాల్లో కొంతైనా ఆనందం నింపవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ అనిల్ కుమార్, మాజీ ఎంపీటీసీ నాగులు నాయక్, మాజీ సర్పంచ్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY