Veldanda: ఆసుపత్రిలో భారతమ్మకు పరామర్శ: బీఆర్ఎస్ నేతల సాయం!

Veldanda: గుండెపోటుతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వెల్దండ వాసి నాగిళ్ల భారతమ్మను బీఆర్ఎస్ నేతలు పరామర్శించి రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేశారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 12 Oct 2026 10:24 PM IST
Veldanda
X

Veldanda: ఆసుపత్రిలో భారతమ్మకు పరామర్శ: బీఆర్ఎస్ నేతల సాయం!

వెల్దండ: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రానికి చెందిన నాగిళ్ల భారతమ్మ గుండెపోటుతో హైదరాబాదులోని ప్రవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఆదివారం విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు కానుగుల జోగయ్య, 12వ వార్డు మెంబర్ సిరసనగండ్ల శేఖర్ హైదరాబాద్ లో ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి భారతమ్మని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని అధైర్య పడకుండా ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు.

అనంతరం వైద్య ఖర్చులకోసం కానుగుల జోగయ్య రూ 5000/ వేల రూపాయలు, 12వ వార్డు మెంబర్ సభ్యులు సిరసనగండ్ల శేఖర్ రూ 5000/ వేల రూపాయలు కలిపి మొత్తం రూ 10,000/ వేల రూపాయలను భారతమ్మ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వెల్దండ మాజీ ఎంపీటీసీ జ్యోతి నిరంజన్, కట్ట అనిల్ కుమార్, శివరాజ్, వెంకటేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY