Veldanda: తండాలకు గ్రామపంచాయతీ హోదా కల్పించిన ఘనత కేసీఆర్‌దే!

Veldanda: తెలంగాణలో గిరిజన తండాలకు ప్రత్యేక గ్రామపంచాయతీ హోదా కల్పించి లంబాడీ గిరిజనుల ఆత్మగౌరవాన్ని పెంపొందించిన ఘనత కేసీఆర్‌దేనని బీఆర్ఎస్ నేత అంజీ మాస్టర్ పేర్కొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 27 Nov 2026 12:41 PM IST
Veldanda
X

Veldanda: తండాలకు గ్రామపంచాయతీ హోదా కల్పించిన ఘనత కేసీఆర్‌దే!

వెల్దండ: తెలంగాణ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) పాలనలో లంబాడీ గిరిజనుల అభ్యున్నతికి అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారని బీఆర్ఎస్ వెల్దండ మండల నాయకులు అంజి మాస్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన తండాలకు ప్రత్యేక గ్రామపంచాయతీ హోదా కల్పించడం కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాల్లో ఒకటని పేర్కొన్నారు. 2018 తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ద్వారా 500కు పైగా జనాభా ఉన్న అనేక గిరిజన తండాలను ప్రత్యేక గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఈ నిర్ణయంతో తండాలకు సొంత సర్పంచులు, వార్డు సభ్యులు ఏర్పడి, గిరిజనులకు స్థానిక పాలనలో భాగస్వామ్యం కలిగిందన్నారు. గతంలో అభివృద్ధికి దూరంగా ఉన్న తండాల్లో రహదారులు, తాగునీరు, విద్యుత్, విద్య వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చిందని గుర్తు చేశారు.గిరిజనుల ఆత్మగౌరవాన్ని పెంపొందిస్తూ, వారి గ్రామాల అభివృద్ధికి మార్గం సుగమం చేసిన కేసీఆర్‌కు లంబాడీ సమాజం ఎప్పటికీ రుణపడి ఉంటుందని అంజి మాస్టర్ అన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY