Nagarkurnool: ఘనంగా ముత్యాలమ్మ పండుగ: బీజేపీ నేత ఎంజేఆర్ పూజలు!

Nagarkurnool: నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం కళ్యా తండాలో జరిగిన ముత్యాలమ్మ పండుగ వేడుకల్లో బీజేపీ రాష్ట్ర నాయకులు ముచ్చర్ల జనార్దన్ రెడ్డి (MJR) పాల్గొని పూజలు చేశారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 11 Nov 2026 5:51 PM IST
Nagarkurnool
X

Nagarkurnool: ఘనంగా ముత్యాలమ్మ పండుగ: బీజేపీ నేత ఎంజేఆర్ పూజలు!

నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలంలోని రాచర్లపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని కళ్యా తండాలో బీజేపీ మండల నాయకులు రవి నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముత్యాలమ్మ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు బీజేపీ రాష్ట్ర నాయకులు, నాగర్‌కర్నూల్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు, కరాటే అసోసియేషన్ చైర్మన్ ముచ్చర్ల జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేకంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన ముత్యాలమ్మ అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను కాపాడుకోవడం, ఐక్యతతో పండుగలను నిర్వహించుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు కొమ్ము శ్రీను, సందీప్ కుమార్, దుబ్బ రాములు, బండి మల్లేష్, ఆంజనేయులు, ప్రసాద్ నాయక్, కుమార్ నాయక్, ప్రవీణ్ నాయక్ తదితరులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY