Nagarkurnool: కొరటికల్‌లో భారీ చోరీ: 10 తులాల బంగారం అపహరణ!
Nagarkurnool: నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం కొరటికల్ గ్రామంలో తాళం వేసిన ఇంట్లోకి చొరబడిన దుండగులు 10 తులాల బంగారం, రూ.1.50 లక్షల నగదును దోచుకెళ్లారు.
Nagarkurnool: కొరటికల్‌లో భారీ చోరీ: 10 తులాల బంగారం అపహరణ!
Nagarkurnool: ఉప్పునుంతల మండలంలోని కొరటికల్ గ్రామంలో భారీ దొంగతనం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి వెనుక కిటికీని ధ్వంసం చేసి 10 తులాల బంగారు ఆభరణాలతో పాటు రూ.1.50 లక్షల నగదును అపహరించారు.గ్రామానికి చెందిన గోపిరెడ్డి భారతమ్మ ఆమె భర్త బచ్చిరెడ్డి ఇద్దరుశుక్రవారం ఇంటికి తాళం వేసి డిండి గ్రామానికి వెళ్లారు.
శనివారం తిరిగి వచ్చి చూడగా ఇంటి వెనుక కిటికీ ధ్వంసమై ఉండటాన్ని గుర్తించారు. వెంటనే ఇంట్లో పరిశీలించగా సుమారు 7 తులాల బంగారు చంద్రహారం, 3 తులాల బంగారు కంకణాలు, రూ.1.50 లక్షల నగదు కనిపించకపోవడంతో చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న ఉప్పునుంతల ఎస్సై పుట్ట మహేష్ గౌడ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ విషయంపై కేసు నమోదు చేసి అనంతరం క్లూస్ టీంతో వివరాలు సేకరించి ఘటనపై విచారణ చేపట్టి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.




