Uppununthala: అక్రమ ఇసుక తరలింపుపై రెవెన్యూ దాడి.. రెండు ట్రాక్టర్లు సీజ్!
Uppununthala: నాగర్కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం దసర్లపల్లి నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను రెవెన్యూ సిబ్బంది అదుపులోకి తీసుకోగా, ఒక ట్రాక్టర్ పరారైంది.
Uppununthala: అక్రమ ఇసుక తరలింపుపై రెవెన్యూ దాడి.. రెండు ట్రాక్టర్లు సీజ్!
ఉప్పునుంతల: నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం దసర్లపల్లి గ్రామం నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను రెవెన్యూ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఇసుక ట్రాక్టర్లను ఉప్పునుంతల పోలీస్ స్టేషన్ కు తరలిస్తుండగా ఒక ట్రాక్టర్ పరారయ్యింది. మిగిలిన రెండు ట్రాక్టర్లను రెవెన్యూ సిబ్బంది పోలీస్ స్టేషన్ కు తరలించారు.
అక్రమ ఇసుక రవాణాపై ఫిర్యాదులు రావడంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లోనే ఇసుకతో వెళ్తున్న ట్రాక్టర్లను పట్టుకున్నారు. పరారైన ట్రాక్టర్ కోసం గాలింపు కొనసాగుతోంది. సీజ్ చేసిన ట్రాక్టర్లపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.




