Nagarkurnool: ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో పేదలకు అన్యాయం: బీఆర్ఎస్!

Nagarkurnool: ఉప్పునుంతలలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో పేదలకు అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ సర్పంచులు ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతిపత్రం అందజేశారు

V. RAVINDR GOUD, ACCHAMPETA
Updated on: 12 Oct 2026 7:32 PM IST
Nagarkurnool
X

Nagarkurnool: ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో పేదలకు అన్యాయం: బీఆర్ఎస్!

Nagarkurnool: ఉప్పునుంతల మండలంలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో నిరుపేదలకు అన్యాయం జరుగుతోందని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కొత్త రవీందర్ రావు మరియు జిల్లా సర్పంచ్ సంఘం ప్రధాన కార్యదర్శి రామ్ భీష్మ విమర్శించారూ.ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం ఎంపీడీవో వరుణ్ తేజ్ కు వినతి పత్రం అందించారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు మాట్లాడుతూ తమకు కనీస సమాచారం లేకుండానే లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారని భూములు,ఇండ్లు ఉన్నవారికి ఇండ్లు ఇస్తున్నారు. కాంగ్రెస్ లీడర్లు ఎవ్వరికి ఇవ్వాలి అంటే వారికే ఇండ్లను కేటాయిస్తున్నారు ఇస్తున్నారు.

ఇందిరమ్మ కమిటీ గతములో సర్పంచులు లేకపోవడంతో నామమాత్రానికి కమిటీ ఎయ్యడం జరిగినది. కాబట్టి సర్పంచి ఎలక్షన్ల కంటే ముందు ఉన్న కమిటీలను రద్దుచేసి, ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల ఎంపిక గ్రామపంచాయతీ ద్వారా నడిస్తే పారదర్శకంగా ఉంటుంది.

అధికారులు ఇందిరమ్మ కమిటీలకు ప్రాధాన్యతనిస్తూ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు అని అధికారులు నిబంధనల పకారము ఎంపిక చేయకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని అధికారులపై చర్య తీసుకునే దగ్గర వదిలే ప్రసక్తే లేదని సర్పంచులు ముక్తకంఠంతో తెలియజేయడం జరిగినది

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సర్పంచులు పెద్దాపూర్ సర్పంచ్ సాయిబాబు ,లక్ష్మాపూర్ సర్పంచ్ గోపాల్, వెల్టూరు సర్పంచ్ వెంకటేష్ లత్తిపూర్ సర్పంచ్ మోణ్య నాయక్, ప్యూర్ తాండ సర్పంచ్ మోత్యా,సుమన్ రెడ్డి సుధాకర్ రెడ్డి,బాలస్వామి రమేష్,పర్వతాలు తదితరులు పాల్గొన్నారు.

V. RAVINDR GOUD, ACCHAMPETA

V. RAVINDR GOUD, ACCHAMPETA