Nagarkurnool: బంజారా సమాజ అభివృద్ధికి కృషి చేస్తా: శివాని బాయ్!
Nagarkurnool: నాగర్‌కర్నూల్ జిల్లా టీఆర్ఎస్ బంజారా విభాగం అధ్యక్షురాలిగా కాట్రావత్ శివాని బాయ్ నియమితులయ్యారు. అవకాశం కల్పించిన పార్టీ అధినేత్రి కవితకు కృతజ్ఞతలు తెలిపారు.
Nagarkurnool: బంజారా సమాజ అభివృద్ధికి కృషి చేస్తా: శివాని బాయ్!
నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా టీఆర్ఎస్ బంజారా విభాగం అధ్యక్షురాలిగా నియమితులైన కాట్రావత్ శివాని బాయ్ తనకు ఈ అవకాశం కల్పించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి పదవి అప్పగించిన టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవితమ్మ, రాష్ట్ర సీనియర్ నాయకుడు ఎల్. రూప్ సింగ్ నాయక్, గ్రేటర్ హైదరాబాద్ జిల్లా బంజారా అధ్యక్షుడు వడ్త్యా కళ్యాణ్ నాయక్, పూని బాయ్‌తో పాటు జిల్లా ఇన్‌చార్జి, పార్టీ నాయకులు, పెద్దలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.
ఈ పదవి తనకు కేవలం గౌరవం మాత్రమే కాదని, ప్రజలకు మరింత సేవ చేసే బాధ్యతగా భావిస్తున్నానని శివాని బాయ్ పేర్కొన్నారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రజా సమస్యల పరిష్కారం, బంజారా సమాజ అభివృద్ధి కోసం నిబద్ధతతో పనిచేస్తానని తెలిపారు. నాయకులు, కార్యకర్తలు, ప్రజల అభిమానం, ఆశీర్వాదమే తనకు బలమని పేర్కొన్నారు.




