Nagarkurnool: గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తం

Nagarkurnool: నాగర్‌కర్నూల్ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కేటాయింపు అస్తవ్యస్తం. అచ్చంపేట, అమ్రాబాద్ పాఠశాలల్లో విద్యార్థుల ఇబ్బందులపై ఐటీడీఏ అధికారులకు 5 డిమాండ్లు.

V. RAVINDR GOUD, ACCHAMPETA
Published on: 7 Nov 2026 7:59 PM IST
Nagarkurnool
X

Nagarkurnool: గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తం

నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లాలో పేద గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కేటాయింపు పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. విద్యా వ్యవస్థలోని ఈ అసమానతలపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని గిరిజన విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.విద్యార్థుల ప్రయోజనాలను కోరుకునే వారు, గిరిజన సంఘ నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఒకవైపు టీచర్లు లేక విద్యార్థులు అల్లాడుతుంటే.

జిల్లాలోని అనేక ఆశ్రమ పాఠశాలల్లో కీలకమైన సబ్జెక్టులకు ఉపాధ్యాయులే లేక విద్యార్థులు చదువులో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అచ్చంపేట ఆశ్రమ పాఠశాలలో ఇప్పటివరకు బయోసైన్స్ సబ్జెక్టుకు ఉపాధ్యాయుడు లేకపోయినా విద్యార్థులు పరీక్షల్లో ఎలా ఉత్తీర్ణులవుతున్నారని ప్రశ్నిస్తున్నారు. దీనిని బట్టి అక్కడ విద్యా బోధన ఎలా జరుగుతోందో అర్థం చేసుకోవచ్చని, ఇది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవడమేనని ఆరోపించారు.

మరోవైపు ఒకే సబ్జెక్టుకు ఇద్దరు, ముగ్గురు టీచర్లు -

మరికొన్ని పాఠశాలల్లో ఒకే సబ్జెక్టుకు ఇద్దరు, ముగ్గురు ఉపాధ్యాయులు పనిచేస్తున్న పరిస్థితి నెలకొందని వారు గణాంకాలతో సహా బయటపెట్టారు. అమ్రాబాద్ మండలం జంగారెడ్డిపల్లి ఆశ్రమ పాఠశాలలో ఇద్దరు బయోసైన్స్ ఉపాధ్యాయులు కొల్లాపూర్ మండలం నార్లపూర్ లో ఇద్దరు గణిత ఉపాధ్యాయులు కల్వకుర్తిలో నియోజకవర్గం ఇద్దరు తెలుగు ఉపాధ్యాయులు, ఇద్దరు బయోసైన్స్ ఉపాధ్యాయులు అమ్రాబాద్ మండలం మన్ననూర్ లో ఇద్దరు ఇంగ్లీష్ ఉపాధ్యాయులు, ఇద్దరు తెలుగు ఉపాధ్యాయులుl అలాగే జిల్లాలోని మరికొన్ని పాఠశాలల్లో హిందీకి ఇద్దరు, ఫిజికల్ సైన్స్ కు ఇద్దరు, తెలుగుకు ముగ్గురు చొప్పున ఉన్నారు.

ఒకవైపు ఉపాధ్యాయుల కొరతతో పేద గిరిజన విద్యార్థులు నష్టపోతుంటే, మరోవైపు ఒకే పాఠశాలలో ఒకే సబ్జెక్టుకు అదనపు ఉపాధ్యాయులు ఉండటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ అసమతుల్యతకు బాధ్యత ఎవరిది? ఇందులో రాజకీయ జోక్యం ఉందా? వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇష్టానుసారం పోస్టింగ్ లు ఇస్తున్నారా? అని సంబంధిత ఉన్నతాధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఐటీడీఏ అధికారులకు 5 ప్రధాన డిమాండ్లు:

ఈ నేపథ్యంలో గిరిజన సంఘాలు 5 ప్రధాన డిమాండ్లను ముందుంచాయి. జిల్లాలోని అన్ని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయుల వివరాలను వెంటనే సేకరించాలి.

ఖాళీల భర్తీ: ఏ పాఠశాలలో ఏ సబ్జెక్టుకు ఉపాధ్యాయుడు లేడో గుర్తించి వెంటనే నియమించాలి.

సమాన పంపిణీ: అదనంగా ఉన్న ఉపాధ్యాయులను అవసరమున్న పాఠశాలలకు డిప్యుటేషన్ లేదా నిబంధనల ప్రకారం బదిలీ చేయాలి.

ప్రతి సబ్జెక్టుకు టీచర్: ప్రతి పాఠశాలలో అన్ని ప్రధాన సబ్జెక్టులకు తప్పనిసరిగా సబ్జెక్టు టీచర్లను అందుబాటులో ఉంచాలి.

ఉపాధ్యాయుల కేటాయింపులో రాజకీయాలకు, వ్యక్తిగత ప్రయోజనాలకు తావులేకుండా పూర్తి పారదర్శక విధానం అమలు చేయాలి.

గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం ప్రభుత్వ బాధ్యత అని, ఉపాధ్యాయులు లేని పాఠశాలల్లో చదువుతున్న పేద గిరిజన విద్యార్థులకు న్యాయం చేయాలని, ఈ సమస్యపై ఐటీడీఏ అధికారులు, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, సంబంధిత విద్యాశాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

V. RAVINDR GOUD, ACCHAMPETA

V. RAVINDR GOUD, ACCHAMPETA