Urkonda: మృతుడి కుటుంబానికి తలసాని అనిల్‌రెడ్డి ఆర్థిక చేయూత

Urkonda: నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండలో అనారోగ్యంతో మృతి చెందిన ఆకుల ఈశ్వరయ్య కుటుంబానికి తలసాని అనిల్‌రెడ్డి రూ.5,000 ఆర్థిక సాయం అందజేశారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 19 Nov 2026 11:29 PM IST
Urkonda
X

Urkonda: మృతుడి కుటుంబానికి తలసాని అనిల్‌రెడ్డి ఆర్థిక చేయూత

ఊర్కొండ: మండల కేంద్రానికి చెందిన ఆకుల ఈశ్వరయ్య అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న జకినాలపల్లి మాజీ సర్పంచ్, తలసాని అనిల్‌రెడ్డి (TAR) మృతుడి కుటుంబానికి అండగా నిలిచారు. కాంగ్రెస్ నాయకుల ద్వారా బాధిత కుటుంబానికి రూ.5,000 ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఆపద సమయంలో కుటుంబానికి అండగా నిలిచిన అనిల్‌రెడ్డికి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ కంఠం యాదయ్య, టీజేఏసీ జడ్చర్ల ఇన్‌చార్జి ఆలకుంట వెంకటేష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాదారం ప్రేమయ్య, కంఠం తిరుపతయ్య, నరేష్, కృష్ణయ్య, కుమార్, పరశురాములు, అంజయ్య, నరసింహ, సహదేవ్ తదితరులు ఉన్నారు

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY