Nagarkurnool: నాగర్‌కర్నూల్‌లో 150 మంది అయ్యప్ప భక్తుల మాలధారణ!
Nagarkurnool: నాగర్‌కర్నూల్ శ్రీధర్మశాస్తా ఆలయంలో శరణుఘోష నడుమ 150 మంది భక్తులు మాలధారణ స్వీకరించి భక్తిశ్రద్ధలతో అయ్యప్ప మండల దీక్షను ప్రారంభించారు.
Nagarkurnool: నాగర్‌కర్నూల్‌లో 150 మంది అయ్యప్ప భక్తుల మాలధారణ!
Nagarkurnool: జిల్లా కేంద్రంలోని శ్రీధర్మశాస్తా అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప స్వాముల శరణుఘోష నడుమ 150 మంది భక్తులు బుధవారం మాలధారణ స్వీకరించి మండల దీక్షను ప్రారంభించారు. న్యూ పాఠశాల సన్నిధానం గురుస్వామి కందూరు తిరుపతయ్య, మణికంఠ సన్నిధానం గురుస్వామి పసుపుల సుదర్శన్, సూర్యచంద్ర సన్నిధానం గురుస్వాముల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఈ సందర్భంగా గురుస్వాములు అయ్యప్ప దీక్ష విశిష్టతను వివరిస్తూ.. మండల దీక్ష కాలంలో భక్తులు నియమ నిష్ఠలు, పవిత్రత, బ్రహ్మచర్యం పాటిస్తూ సాత్విక ఆహారం తీసుకోవాలని సూచించారు. ప్రతిరోజూ స్వామివారికి పూజలు, భజనలు నిర్వహిస్తూ ఆధ్యాత్మిక చింతనతో గడపాలని తెలిపారు. అయ్యప్ప దీక్ష ద్వారా భక్తుల్లో క్రమశిక్షణ, సహనం, సమానత్వం, సేవాభావం పెంపొందుతాయని పేర్కొన్నారు.
150 మంది భక్తులు ఒకేసారి మాలధారణ చేయడంతో ఆలయ ప్రాంగణం అయ్యప్ప నామస్మరణ, శరణుఘోషతో మార్మోగి భక్తిమయంగా మారింది. కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు పసుపుల సుందర్ గురు స్వామి, ఆలయ ప్రధాన అర్చకులు గవ్వమఠం విజయకుమార్ శాస్త్రి పాల్గొన్నారు.




