Nagarkurnool: పెండింగ్ కేసుల పరిష్కారానికి ఎస్పీ ఆదేశం

Nagarkurnool: నాగర్‌కర్నూల్ జిల్లా ఉర్కొండ పోలీస్ స్టేషన్, కల్వకుర్తి డీఎస్పీ కార్యాలయాన్ని ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ తనిఖీ చేసి పెండింగ్ కేసులపై సూచనలు చేశారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 19 Nov 2026 9:51 PM IST
Nagarkurnool
X

Nagarkurnool: పెండింగ్ కేసుల పరిష్కారానికి ఎస్పీ ఆదేశం

నాగర్ కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ఐపీఎస్ వార్షిక తనిఖీల్లో భాగంగా కల్వకుర్తి సబ్ డివిజన్ డీఎస్పీ కార్యాలయంతో పాటు ఉర్కొండ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలు, రికార్డులు, సిబ్బంది విధుల నిర్వహణను పరిశీలించారు.

స్టేషన్‌కు వచ్చే బాధితుల పట్ల మర్యాదగా వ్యవహరిస్తూ, ప్రతి ఫిర్యాదుపై వేగంగా స్పందించి పారదర్శక విచారణ ద్వారా న్యాయం జరిగేలా చూడాలని సూచించారు. డయల్ 112 కాల్స్‌కు తక్షణమే స్పందించి బాధితులకు సకాలంలో సహాయం అందించాలని బ్లూకోల్ట్స్ సిబ్బందిని ఆదేశించారు.

రౌడీషీటర్ల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని, గ్రామస్థాయిలో విలేజ్ పోలీస్ ఆఫీసర్లు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు. సైబర్ క్రైమ్ వారియర్స్, సీసీటీవీ ఇన్‌చార్జిలు, రిసెప్షన్ సిబ్బంది పనితీరును సమీక్షించారు.

పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి, కేసుల దర్యాప్తులో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ నిర్వహణ, రికార్డుల భద్రత, సిబ్బంది క్రమశిక్షణ పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ పోలీస్ సిబ్బందిని అభినందించారు.

ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ఈ తనిఖీలో కల్వకుర్తి డీఎస్పీ వెంకట్ రెడ్డి, సీఐ భీమ్ కుమార్, ఉర్కొండ ఎస్సై రమాదేవితో పాటు కల్వకుర్తి సబ్ డివిజన్ పరిధిలోని ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY