Urukonda: జాతీయ కరాటే పోటీల్లో రాణించిన రెయిన్‌బో విద్యార్థులు
Urukonda: నాగర్ కర్నూల్ జిల్లా ఊరుకొండ రెయిన్‌బో పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయి కరాటే పోటీల్లో ప్రతిభ కనబరచడంపై ప్రముఖులు వారిని అభినందించారు.
Urukonda: జాతీయ కరాటే పోటీల్లో రాణించిన రెయిన్‌బో విద్యార్థులు
ఊరుకొండ: నాగర్ కర్నూల్ జిల్లా ఊరుకొండ మండలం జాతీయ స్థాయి కరాటే పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచిన ఉర్కొండ రెయిన్‌బో ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులను పలువురు ప్రముఖులు అభినందించారు.
28వ నేషనల్ ఇన్విటేషన్ కరాటే ఛాంపియన్‌షిప్–2026లో పాల్గొన్న 19 మంది విద్యార్థులను నాగర్‌కర్నూల్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు, కరాటే అసోసియేషన్ చైర్మన్ ముచ్చర్ల జనార్దన్ రెడ్డి, ఉర్కొండ సర్పంచ్ మంజుల శ్రీనివాస్, పాఠశాల కరస్పాండెంట్ జె. లక్ష్మీనారాయణ అభినందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. కరాటే సాధన వల్ల శారీరక దృఢత్వంతో పాటు ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ పెంపొందుతాయని పేర్కొన్నారు.
విద్యార్థులు ఇలాంటి పోటీల్లో మరింత ఉత్సాహంగా పాల్గొంటూ ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులకు పలు సలహాలు, సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ నస్రీన్, ఉపాధ్యాయ బృందం, మండల నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.




