Nagarkurnool: హకీం విశ్వప్రసాద్‌కు ప్రతిష్టాత్మక మల్టిపుల్ అవార్డు!
Nagarkurnool: లయన్స్ క్లబ్ విస్తరణ, సభ్యత్వ నమోదులో విశేష సేవలందించిన నాగర్‌కర్నూల్ లయన్స్ క్లబ్ సభ్యుడు హకీం విశ్వప్రసాద్‌కు హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మక మల్టిపుల్ అవార్డు లభించింది.
Nagarkurnool: హకీం విశ్వప్రసాద్‌కు ప్రతిష్టాత్మక మల్టిపుల్ అవార్డు!
నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ లయన్స్ క్లబ్ సభ్యుడు హకీం విశ్వప్రసాద్ కబ్ప్రతిష్టాత్మక మల్టిపుల్ అవార్డు వరించింది. శనివారం రాత్రి హైదరాబాద్ శామీర్ పేట్ లోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హల్ లో జరిగిన మల్టిపుల్ అవార్డ్స్ నైట్ లో గత మల్టిపుల్ చైర్మన్ రాజేంద్ర ప్రసాద్, మాజీ డిస్ట్రిక్ట్ గవర్నర్ మహేంద్ర కుమార్ రెడ్డి,ప్రస్తుత మల్టిపుల్ చైర్మన్ అమర నాథ రావు,ప్రస్తుత గవర్నర్ సురేష్ జగ్నని చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు.
గత సంవత్సరం డిస్ట్రిక్ట్ మెంబర్ షిప్ కోఆర్డినేటర్ గా పనిచేసిన కాలంలో కొత్తగా లయన్స్ క్లబ్స్ స్థాపించడం, పాత క్లబ్బులలో నూతన సభ్యులను చేర్పించడంలో హకీం విశ్వప్రసాద్ చేసిన కృషికి గాను ఈ అవార్డు లభించింది. ఈ కార్యక్రమం లో లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ లు రాధాకృష్ణ, చెన్న కిషన్ రెడ్డి, హరినారాయణ్ బట్టడ్ తదితరులు పాల్గొన్నారు. అవార్డు పొందిన విశ్వ ప్రసాద్ ను అభినందించారు. వారితో పాటు నాగర్ కర్నూల్ క్లబ్ సభ్యులు కూడా అభినందనలు తెలియచేసారు.
అవార్డు అందుకున్న హకీం విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ తాను ఇరవై సంవత్సరాల క్రితం నాగర్ కర్నూల్ లయన్స్ క్లబ్ లో సభ్యత్వం తీసుకొని అప్పటి నుండి ప్రతి సంవత్సరం అధ్యక్షులకు సహకరిస్తూ అనేక సేవకార్యక్రమాలకు చేయూత ఇవ్వడం జరిగిందని, రాష్ట్ర స్థాయిలో నిర్వహించే కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనడం జరిగిందని, అవార్డు అందుకొన్నందుకు సంతోషంగా ఉందని, రాబోయే కాలంలో కూడా నాగర్ కర్నూల్ క్లబ్ అభివృద్ధికి తొడ్పడతనానికి, అవార్డు రావడానికి సహకరించిన అందరికి కృతజ్ఞతలు తెలియచేసారు.




